కడబాల నాగేశ్వర్ రావు
కడబాల "గిరిజన శతకము"
1.విఘ్ననాథ! కరుణ వీక్షణాలందించు
అక్షరాల కూర్పు అమరునట్లు
సహకరించగవలె శతకమొకటి వ్రాయ
మన్నె బిడ్డ మాట మంచి బాట.
2.ఆదివందనంబు అడవి తల్లికి జేసి
సిరుల నిచ్చునట్టి గిరుల కొలచి
వ్రాయుచుంటినయ్య రమణీయ శతకంబు
మన్నె బిడ్డ మాట మంచి బాట.
3.రంపచోడవరము, రాజవొమ్మంగియు
అడ్డతీగలయను దొడ్డపురము
గంగవరము, యార్లగడ్డ రామవరము
మన్నె బిడ్డ మాట మంచి బాట.
4.మన్యమకుటమైన మారేడుమిల్లియు
పసిడి నేల దేవి పట్టణంబు
మండలములు యేడు మాత్రమే గలవింక
మన్నె బిడ్డ మాట మంచి బాట.
5.అందమైన కోటనందూరు, తుని, శంఖ
వరము, ప్రక్కనున్న ప్రత్తిపాడు
మండలములలో మరికొన్ని ఊళ్ళుండె
మన్నె బిడ్డ మాట మంచి మాట.
6.ఎంపికయ్యె తూర్పు ఏజెన్సిప్రాంతంబు
గిరిబనాభివృద్థి జరుపు సంస్థ
ఐ. టి. డి. య్యె వెలసె అలచోడవరములో
మన్నె బిడ్డ మాట మంచి బాట
7.పదిలపరచబడెను పథకాలు ఎన్నెన్నొ
గిరిజనుల వెతలను తరిమివేయ
కనుక ఐ. టి. డి. య్యె కల్పవృక్షము గదా!
మన్నె బిడ్డ మాట మంచి బాట.
8.సంతసమున నీకు సహకారమందించ
ఆనుపానులన్ని అందు గలవు
బడుగు గిరిజనులకు బ్రతుకు మార్గాలుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట.
9.ఐ. టి. డి. య్యె యనెడుఅభివృద్ధి సంస్థను
ప్రగతి మార్గమందు వేగనడుప
పథక నిర్వహణకు ప్రాజెక్టు అధికారి
మన్నె బిడ్డ మాట మంచి బాట.
10.ఇండ్లు, బండ్లు, ధనము ఇతర సౌకర్యాలు
విద్య, మరియు ఉచిత వైద్య సేవ
చేయుచుండిరయ్య చేరదీసి జనుల
మన్నె బిడ్డ మాట మంచి బాట.
11ప్రభువు మనకు గలడు పథకాలు నడిపించ
కార్యవిధుల జూచు కార్యశీలి
కొలుచు వారి కెల్ల కొంగు బంగారము
మన్నె బిడ్డ మాట మంచి బాట
12అరయ నడవి తల్లి అనురాగవల్లిరా!
అంది పుచ్చుకొనుము అఖిల సుఖము
అడవి వృద్ధి చెంద అవని వర్ధిల్లురా!
మన్నె బిడ్డ మాట మంచి బాట
13. కోయదొరలు మరియు కొండ్రెడ్డి, వాల్లీకి
వన్నె లొలుకు దొరలు, మన్నె దొరలు
కలవు కొండకాపు, కమ్మర కులములు
మన్నె బిడ్డ మాట మంచి బాట
14 మాలొ లేనె లేరు మంగళ్ళు మరిజూడ
సిగల కొరకు జుట్టు సిరులు పెంచు
ఆది నుండి మాకు అంటదు క్షురకర్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట
15 అన్నదమ్ములవలె నన్నింట నుందుము
అడవి తల్లి మెడకు హార మల్లె
ఆది గురువు మాకు అడవి తల్లేనురా !
మన్నె బిడ్డ మాట మంచి. బాట
16 అడవి తల్లి బిడ్డలందరమ్మొక్కటే
లేదు భేష జమ్ము లేదు మాకు
చేయి చేయి కలిపి చేస్తాము పనులన్ని
మన్నె బిడ్డ మాట మంచి బాట
17 కాయకసరు లేరి కలిసి భుజించేము
వావి వరస తెలిసి పలుకుతాము
ఆదిజాతి మాది అన్నిజాతులలోన
మన్నె బిడ్డ మాట మంచి బాట
18 మతము కన్న మాకు మానత్వము మిన్న
పెద్దవారి మాట చద్దిమూట
కూలదోయమెపుడు కుల పెద్దమాటలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
19. మల్లె, సన్నజాజి, మందార, సంపెంగ
విరుల వంటి మనసు వెలుగు మాది
తేనెలొలుకు తేట తెలుగు భాషయెమాది
మన్నె బిడ్డ మాట మంచి బాట
20. అడవి తల్లి ఒడిన అల్లారు ముద్దుగా
ఆడిపాడినాము ఆదమరచి
అరమరికలు లేవుఅభ్యాసమున మాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
21. కొండ కోన మనకు అండగానుండగా
ఎండమావి కాదు కొండ బతుకు
గుండె నిబ్బరమును నిండుగా పెంచుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట
22. చదువు సంధ్యలన్ని చక్కగా నేర్చుకో
భయములేదు నీకు భావియందు
దేశ సేవ చేయ ధీరుడా లేలెమ్ము !
మన్నె బిడ్డ మాట మంచి బాట
23. మనిషి పుట్టి పెరిగి మట్టిలో కలియును
పుడమి తల్లి రుణము విడువ వద్దు
మనిషి జన్మ మనకు మరల కలదోలేదొ
మన్నె బిడ్డ మాట మంచి బాట
24.అలుపెరుగని పనులు సలుపుమాఎవ్వేళ
అమ్మనాన్నలందు ఆదరమును
మరువ వలదు ఎపుడు మనసు నందుంచుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట
25.పీకలోతు తాగి పీనుగుగామారి
భవిత వదిలి నీవు భంగపడకు
పచ్చనయిన బాట వెచ్చగా సాగిపో!
మన్నె బిడ్డ మాట మంచి బాట
26.ఉన్నదాన్ని బట్టి ఒడుపుగా మసలుకో
కోరరాని ఫలము కొంపముంచు
మర్మమెరిగి బ్రతుకు మలచుకో సాగిపో!
మన్నె బిడ్డ మాట మంచి బాట
27.చదువు లేనివాడు అదుపు తప్పునెపుడు
చదువ బడులు కలవు చక్కగాను
విద్యనేర్చినపుడె విజ్ఞానమబ్బురా!
మన్నె బిడ్డ మాట మంచి బాట
28. అడ్డు లేదు నీకు అవని యందెక్కడ
అలుగు వోలెపొమ్ము కలుగు జయము
భావి జీవనంబు బాగుగా వెలుగొందు
మన్నె బిడ్డ మాట మంచి బాట
29. చెట్లు చేమలందు చెలిమిని ఆశించు
కల్మషమ్ము లేని కార్మికులము
కాయకష్టమందు కలుగును ఫలితంబు
మన్నె బిడ్డ మాట మంచి బాట
30. గౌరవించుమయ్య ఘనముగ పెద్దలన్
తల్లిదండ్రి మాట తప్పవద్దు
గురువు గారి మాట సిరుల మూటే కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట.
31. అక్షరాలు రాని అన్యులందరికినీ
విద్య నేర్పవయ్య విధిగ నీవు
విద్య దారి చూపు విశ్వమందు నెపుడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
32. ఆత్మసాక్షి నెరిగి అన్నింట మసలుకో
కీడు చేయబోకు కీర్తి కొరకు
నీతి లేని వాడు కోతి కంటెను పాడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
33. చట్ట సభల యందు చక్కగా రాణించి
వెలుగు పంచవయ్య విశ్వమునకు
స్ఫూర్పి పొంది నీవు కీర్తి సంపాదించు
మన్నె బిడ్డ మాట మంచి బాట
34. నాయకత్వ లక్షణాలను నేర్చుకో
ప్రగతి వైపు వెళ్ళు పట్టు పెంచి
దూరమేమి కాదు చేరగా విజయమ్ము
మన్నె బిడ్డ మాట మంచి బాట
35. అడవి బుట్టినాము నరయనదృష్టాన
సారిరారు మనకు జగతి నెవరు
గొప్ప చరిత గలదు చెప్పు కొనగ మనకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
36. కొండవాడిననుచు కుంగిపోకెన్నడు
దుష్ట బుద్ది వాని దూషణలకు
కళ్ళు తెరచి నీవు కదము తొక్కవలెరా !
మన్నె బిడ్డ మాట మంచి బాట.
37. అడవి లోనె పుట్టె ఆదిమానవజాతి
గిరులలోనె పుట్టె “గిరిజ మాత”
అడవి తల్లి అండఅన్నిటా నీకుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట.
38. సురల నిలయమంత గిరుల పైనేకదా !
వెరువకయ్య నీవు గిరుల నుండ
గిరులె మనకు నిచ్చు సిరులు వేలకు వేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
39. మొరుగు శునక మెపుడు కరుచుననుట కల్ల
వదరు బోతువలెను వాగ వద్దు
మేలు జేసి చూపు మేటివై జనులకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
40. వటము చూడ భువిన పటువైనదైనను
గాలి వాన రాగ కూలి పోవు
ఎవరి తనువు చూడ ఎంత కాలము మన్ను
మన్నె బిడ్డ మాట మంచి బాట
41. సాంప్రదాయములను చక్కగా కాపాడు
వెర్రి మొర్రి కుర్ర వేష మేల ?
పదిల పరచుమయ్య ప్రాచీన సంస్కృతి
మన్నె బిడ్డ మాట మంచి బాట
42. కుల, మతాల గొడవ కూర్మిని తెగతెంచు
కులము కుళ్ళు కంపు కుదరదయ్య
మతము మత్తు మందు మర్చిపో మహిలోన
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏 ప్రాచీన వర్ణన 🙏
43. దబ్బగడ్డి కప్పు దలుసు మట్టితొ గోడ
అరుగు నల్ల మన్ను అటకపైన
పర్ణశాల వంటి పదిలమైనవి ఇళ్ళు
మన్నె బిడ్డ మాట మంచి బాట
44. గొప్ప అందమైన గోడ చిత్తర్లతో
సుద్ద, పసుపు, నలుపు సుడుల ముగ్గు
“గిరిజ”పనితనములు గీటు రాయిగ నిల్చు
మన్నె బిడ్డ మాట మంచి బాట
45. వంట ఇంట పొయ్యి, వెటసోక “జోలరి”
మట్టి కుండలోని మంచి నీళ్ళు
ఉట్టి మీద చట్టి, చట్టిలో అంబలి
మన్నె బిడ్డ మాట మంచి బాట
46. వెదురు తవ్వ, తట్ట, అదురు టొంపం, మీట
పొడుగు కాడ దోకి, పొట్టి గిద్ద
సొల్ప, దొప్ప, రేక, సొరకాయ దిప్పలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
47. చామ, కొర్ర, గంటె, ఆముదం, ఉలవలు
చోడి, కంది, పెసర,, జొన్న, నువ్వు
చిత్రమైన మన్య చిరుధాన్య సొగసులు
మన్నె బిడ్డ మాట మంచి బాట
48. గుమ్మడాకు కూర, గోమతంటే మాకు
చేమఆకు కూర, చిలక కూర
కాయగూర పువ్వు కంది గుగ్గిళ్ళును
మన్నె బిడ్డ మాట మంచి బాట
49. పనసతొనల కూర, మినపప్పు పులుసు
పుట్ట కొక్కు కూర, మొట్టలిగురు
మాడిటెంక చారు మన్య జనుల విందు
మన్నె బిడ్డ మాట మంచి బాట
50. ఈత పురుగు వంట, పాత బియ్యపు కూడు
కొండ గొర్రె వెంటి, కోడి కూర
వేట సాగినపుడు విందుగాదేమాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
51. వెదురు కొమ్ము కూర, అదిరిపోవు రుచులు
ఉలవ పప్పు చారు విలువ కలది
గొడ్డు గూర ఆకు వండగా వదలరు
మన్నె బిడ్డ మాట మంచి బాట
52. వైము, నార, తేగ, మాటుము దుంప
తింటె హాయి కలిగి తృప్తి కలుగు
అడవి దొరుకు దుంపలాహారమే మాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
53. మాడి టెంక లబ్బి మెత్తగా కరిగించి
అడ్డ ఆకు మీద నద్ది కాల్చ
అదిరిపోవు రుచితొ అట్టు చేకూరును
మన్నె బిడ్డ మాట మంచి బాట
54. పనస పళ్ళ పారు పడిపోవు పిక్కలు
ఏరి తెచ్చి వార్చి ఎండబెట్టి
వానకాలమందు వండి తినుట హాయి
మన్నె బిడ్డ మాట మంచి బాట
55. ఉసిరి, ముషిణి, వేము, ఓషథి మూలికల్
పనస, నిమ్మ, కమల పండ్లు దొరుకు
వాటి నేరి తెచ్చి వర్తకునకు నమ్ము
మన్నె బిడ్డ మాట మంచి బాట
56. వేట లాడనాన్న వెంట అడవికెళ్ళి
అమ్మ కథల పాత్ర లందు జూస్తి
జంతు తతిని కాంచి సంతోషమొందితి
మన్నె బిడ్డ మాట మంచి బాట
57. ముక్కు కడ్డు బాస, ముంజేత మురుగులు
కాళ్ళకు కడియాలు, వేళ్ళ బటువు
మెడన పూసగొలుసు నడయాడు నందాలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
58. నగలు మేను దాల్చి నవ్వులు రువ్వుచు
కురుల విరులు దాల్చి కులుకు లొలుకు
మగువ సొగసు జూడ మరులు పుట్టు మదిన
మన్నె బిడ్డ మాట మంచి బాట
59. చెట్టు, రాయి, రప్ప, పుట్టలోని పురుగు
నీరు, నిప్పు, గాలి, నింగి, ధరణి
సూర్యచంద్రులుయును సురలుగా పూజించు
మన్నె బిడ్డ మాట మంచి బాట
60. అడవి సంపదంత ఆదాయమే నీకు
పనస పండ్లు, తేనె, పచ్చిపసుపు
కొన్ని వెతలు దీరు కొండచీపుర్లమ్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట
61. చింతపండు, పసుపు, శీకాయ దినుసులు
సంచులందు పేర్చి సంతజేర్చు
గోనెబరువు మోయి గోంటెడ్ల చిత్రాలు
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏గంగాలమ్మ పండుగ వేడుక🙏
62. ఆముదాలు తెచ్చి ఆదివారము నాడు
వండి నూనె తీయు వందనముగ
క్రొత్త దుత్త తెచ్చి వత్తిని వెలిగింత్రు
మన్నె బిడ్డ మాట మంచి బాట
63. వెల్లకుండ కేసి రెల్ల పూవులు కట్టి
పసుపు కుంకుమెట్టి పళ్ళనిత్రు
“మల్లొ మల్లొ”అనుచు మలిగంగిపాటతో
మన్నె బిడ్డ మాట మంచి బాట
64. దుత్త నెత్తి నుంచి కొత్త బట్టలు కట్టి
కన్నె పిల్లలంత కదులు తారు
ఇల్లు ఇల్లు దిరిగె ఇలవేల్పు గంగమ్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట
65. జంబటూయలందు అంబను ముందూపి
బూతు పాట పాడి పూజ జేత్రు
గౌరవింతురంత “గొరవ”పూజారిని
మన్నె బిడ్డ మాట మంచి బాట
66. గంగతల్లి కొరకు గంగమ్మ పండుగ
కోలటాట బసలొ కొంటె పాట
భూమితల్లి కొరకు భూదేవి పండుగ
మన్నె బిడ్డ మాట మంచి బాట
67. ఆకు కొమ్మ తెచ్చి అంగటలికి పెట్టి
నిండు కుండలోని నీళ్ళు దెచ్చి
కోడిపుంజుబట్టి కోసి బొట్టును పెట్టు
మన్నె బిడ్డ మాట మంచి బాట
68. మత్తు మాంస ములను చిత్తుగా భుజియించి
ఓయి పాట పాడు హాయి గాను
గంగదేవి కొరకు గంతులే వేసేను
మన్నె బిడ్డ మాట మంచి బాట
🙏 సంకురాతిరి పండుగ 🙏
69. సంకురాత్రి నాటి సందడే సందడి
భోగి తాన మాడి కాగి అగ్గి
పిలిచి దేవతలకు పెట్టు నైవేద్యము
మన్నె బిడ్డ మాట మంచి బాట
70. పశువు కొట్ట మంత పరిశుభ్రముగజేసి
పసుపు కుంకుమలతొ పాడి కొరకు
పూజ జేతురయ్య ముదముతో పల్లెలన్
మన్నె బిడ్డ మాట మంచి బాట
🙏🙏 ఆటలు 🙏🙏
71. పండు వెన్నెలందు పడుచులంతా జేరి
గొంతెనమ్ము లాడు గోలజేస్తు
ముక్కు గిల్లుడాట మక్కువైనది కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
72. కుయ్యి కుయ్యి కోడి కూత కుయ్యాలంటు
కూతలాట లాడు కొంటె గాళ్ళు
ఆట లాడ కుంటె ఆనందమే ముంది !
మన్నె బిడ్డ మాట మంచి బాట
🙏 వివాహ పద్ధతులు 🙏
73. కోలటాట బసలొ కొంటె పాటలు పాడి
యువత జతలు కట్టి ఉరుకు తారు
రాక్షసుల వివాహ రకమంటె ఇదియేను
మన్నె బిడ్డ మాట మంచి బాట
74. అమ్మ జాతరంటు అర్థరాత్రుల నందు
వధువు వరుస తెలిసి అదును చూసి
లాగి చేయి పట్ట లాగు లాటల పెళ్ళి
మన్నె బిడ్డ మాట మంచి బాట
75. నచ్చిన వరునెంచి నలుగురితో కల్సి
ఒట్టు పెట్టి కన్య “కోలి”నిచ్చి
సాంప్రదాయమైన చక్కనైనది పెళ్ళి
మన్నె బిడ్డ మాట మంచి బాట
76. “ఓలి”నిచ్చి చేయు ఒద్దికయిన పెళ్ళి
వెళ్ళ వద్దు వెర్రి వేలమునకు
కట్నకానుకెపుడు కాదు శాశ్వతములు
మన్నె బిడ్డ మాట మంచి బాట
77. వెరువ కయ్య నీవు వెనుకబడ్డావని
పట్టుదలను పెంచు ప్రగతి కలుగు
గొట్టి సభల యందు గొంతెత్తి మాట్లాడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
78. ఆశ్రమాన విద్య ఆరోగ్యమందించు
వసతులన్ని కలవు మసలు కొనగ
గిరిజనులను మేటి పురజనులను జేయ
మన్నె బిడ్డ మాట మంచి బాట
79. నాటి గురువు లంత ధీటైన గురువులు
లోటు లేని దమ్మ నాటి విద్య
కష్టపడితి నాడు కలిగె నేడు సుఖము
మన్నె బిడ్డ మాట మంచి బాట
80. పలక పట్టి మేము పాఠశాలకు వెళ్ళి
పంతులయ్య చెప్పు పాఠమంత
ఆలకింపులాయె ఆనాడు మాకెంతొ
మన్నె బిడ్డ మాట. మంచి బాట
81. ఆశ్రమాన మాకు అన్ని వసతులుండె
బట్టలిచ్చు, రేకు పెట్టె లిచ్చు
తలకు నూనె, సబ్బు తానమాడగ నిచ్చు
మన్నె బిడ్డ మాట. మంచి బాట
82. చాప, దుప్పటిచ్చి చక్కగా చూతురు
పుష్కలముగ నిత్రు పుస్తకాలు
విద్యతోడనెన్నొ విషయాలు బోధింత్రు
మన్నె బిడ్డ మాట మంచి బాట
83. మూడుపూట్ల తిండి ముచ్చటగా బెట్టి
బలము మందులిచ్చి బలిమి పెంచి
స్వీటు, పళ్ళు నిత్రు లోటు లేకుండగా
మన్నె బిడ్డ మాట మంచి బాట
84. పాఠశాల యందు పనిచేయ నుద్యోగ
బాధ్యతల విధులను పంచి ఇచ్చు
సక్రమముగ నీవు చరితార్ధుడవు కమ్ము
మన్నె బిడ్డ మాట. మంచి బాట
85. సమసమాజ రూపు సత్వరమే కల్గు
పల్లకుండ వద్దు పాడి గాదు
నీవు చేయు పనులు నిష్ఠగా చేయుము
మన్నె బిడ్డ మాట మంచి బాట
86. అతిపవిత్రముగద అధ్యాపకుని వృత్తి
అంకితమ్ము కమ్ము ఆత్మ సాక్షి
అన్ని వృత్తులకును ఆదర్శమది కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
87.అర్హతకలవారు అంశాలు బోధించ
వృద్ధి చెందగలదు విద్య విలువ
శిక్షణ కరువైన శిధిల మౌనుర విద్య
మన్నె బిడ్డ మాట మంచి బాట
88. ప్రజలు కొంత మంది పనులేమి దొరకక
విద్యబోధ చేయు విధుల జేరి
తప్పిదాలు చేసి తలవంపులగుచుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట
89. పాఠశాల విలువ పదిల పరచువారు
గురువులైన విద్య పరువు నిలుచు
గురువు లేని విద్య గుడ్డి విద్యరజూడ
మన్నె బిడ్డ మాట మంచి బాట
90. కొత్త విషయములను కోర్కెతో నేర్చుకో
మెదడు పదును చెందు మేటి గాను
విద్య లేని నాడు విలువేమి పెరుగురా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
91. తాగవద్దు పొగను, తల నున్నగా దువ్వు
బట్ట శుభ్రముంచి బడికి వెళ్ళు
పాదరక్ష వేసి ప్రగతి రక్షింపుమా! మన్నె బిడ్డ మాట మంచి బాట
92. సిగరు, జర్ధ, బీడి చెరచురా నీమేను
విడిచి పెట్టగవలె విధిగ నీవు
చెడ్డగుణము చూసి చెడిపోవు పిల్లలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
93. శాస్త్ర విషయమెల్ల చక్కగా తెలుసుకో
ఇంటిలోకి వచ్చు ఇంట్రనెట్టు
పల్లె పట్నమంత పాకింది ఈనెట్టు
మన్నె బిడ్డ మాట మంచి బాట
94. వార్తలెల్ల చదివి వర్ణంచి చెప్పాలి
విషయమంత తెలియు వివిధ గతుల
వార్తవలన జగతి వర్ధిల్లుచున్నది
మన్నె బిడ్డ మాట మంచి బాట
95. అర్ధగంట సేపు అభ్యాసమొనరించి
పావుగంటలోన ప్రశ్న నేర్పు
పిరికి తనము పోవు పిల్లలందరికిని
మన్నె బిడ్డ మాట మంచి బాట
96. సులువు తెలుసుకుంటె కొలువు పొందగవచ్చు
కొలువు పొందినపుడె కోర్కె తీరు
కోర్కె తీరినపుడె కొరత తీరును కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
97. వెర్రి జతలు బట్టి వెలగాక తిరిగిన
బ్రతుకు కష్టమగును వెతలు కలుగు
మంచి దారి బట్టి మసలుకొనుట మేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
98. ఏడ్సు భూతమొచ్చి ఎందరినో జంపె
యుక్తి తెలుసుకోండి యువకులంత
జబ్బు వస్తె మందు జగతిలో లేదయ్య
మన్నె బిడ్డ మాట మంచి బాట
99. తిరుగు బోతువారి తీట తీర్చగవచ్చె
ఏడ్సు రోగమనెడు ఎండు తెగులు
మరిచిపోక మంచి మార్గమెంచుకొనుడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
100.ఏకలవ్య ధీక్ష నెన్నుకొనుము నీవు
బీదవాడి ననుచు బిడియపడకు
కాంచి నేర్చుకొనుము కన్నప్ప పట్టును
మన్నె బిడ్డ మాట మంచి బాట
101.ఐ. టి. రంగమందు ఆదరణ కలదు
శాస్త్ర విద్య నేర్వ సౌఖ్యమయ్య
ఇంజనీరు విద్య నెంచకొనుట మేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
102.గాలి వేగమైన కమ్యూనికేషన్లు
శీఘ్రగతిన జేరు చిట్టి కబురు
తంతిలేని ఫోన్ల వింతలను తెలుసుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట
103.సులభ మార్గమైన సుఖములున్నవినేడు
మేను అలవనట్టి, మేటి హాయి
శాస్త్ర విద్య యొక్క సౌఖ్యమే కద ఇదీ !
మన్నె బిడ్డ మాట మంచి బాట
104.కంప్యుటర్ల మహిమ కడురమ్యమైనది
కొద్దిలోనె తొలగు పెద్ద చిక్కు
సెకనులోనె పనులు చేసి చూపగ వచ్చు
మన్నె బిడ్డ మాట మంచి బాట
105.కల్లు చెట్ల చుట్టు కలిసి తిరుగుతారు
చుట్ట లడ్డ పొగను జుర్రుతారు
కాదు కూడదంటె కసురు కుంటారయ్య
మన్నె బిడ్డ మాట మంచి బాట
106.నమ్మి నారు అంటె నాన బోసేస్తారు
కసురు కుంటె మరల కానరారు
అడవి బిడ్డ మనసు ఆదర్శప్రాయము
మన్నె బిడ్డ మాట మంచి బాట
107.దిక్కుమొక్కు లేని దీనబాలురకైన
తిండి వసతి, బట్ట తృప్తిగాను
ఉచిత విద్య నేర్ప ఊరూర బడులుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట
108.జనులు అధికమైన పనులెట్లు దొరుకును
సంతు ఎక్కువైన వింత బాధ
ఒక్క బిడ్డ చాలు చక్కగా పెంచంగ
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏 సమాప్తం 🙏
కడబాల "గిరిజన శతకము"
1.విఘ్ననాథ! కరుణ వీక్షణాలందించు
అక్షరాల కూర్పు అమరునట్లు
సహకరించగవలె శతకమొకటి వ్రాయ
మన్నె బిడ్డ మాట మంచి బాట.
2.ఆదివందనంబు అడవి తల్లికి జేసి
సిరుల నిచ్చునట్టి గిరుల కొలచి
వ్రాయుచుంటినయ్య రమణీయ శతకంబు
మన్నె బిడ్డ మాట మంచి బాట.
3.రంపచోడవరము, రాజవొమ్మంగియు
అడ్డతీగలయను దొడ్డపురము
గంగవరము, యార్లగడ్డ రామవరము
మన్నె బిడ్డ మాట మంచి బాట.
4.మన్యమకుటమైన మారేడుమిల్లియు
పసిడి నేల దేవి పట్టణంబు
మండలములు యేడు మాత్రమే గలవింక
మన్నె బిడ్డ మాట మంచి బాట.
5.అందమైన కోటనందూరు, తుని, శంఖ
వరము, ప్రక్కనున్న ప్రత్తిపాడు
మండలములలో మరికొన్ని ఊళ్ళుండె
మన్నె బిడ్డ మాట మంచి మాట.
6.ఎంపికయ్యె తూర్పు ఏజెన్సిప్రాంతంబు
గిరిబనాభివృద్థి జరుపు సంస్థ
ఐ. టి. డి. య్యె వెలసె అలచోడవరములో
మన్నె బిడ్డ మాట మంచి బాట
7.పదిలపరచబడెను పథకాలు ఎన్నెన్నొ
గిరిజనుల వెతలను తరిమివేయ
కనుక ఐ. టి. డి. య్యె కల్పవృక్షము గదా!
మన్నె బిడ్డ మాట మంచి బాట.
8.సంతసమున నీకు సహకారమందించ
ఆనుపానులన్ని అందు గలవు
బడుగు గిరిజనులకు బ్రతుకు మార్గాలుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట.
9.ఐ. టి. డి. య్యె యనెడుఅభివృద్ధి సంస్థను
ప్రగతి మార్గమందు వేగనడుప
పథక నిర్వహణకు ప్రాజెక్టు అధికారి
మన్నె బిడ్డ మాట మంచి బాట.
10.ఇండ్లు, బండ్లు, ధనము ఇతర సౌకర్యాలు
విద్య, మరియు ఉచిత వైద్య సేవ
చేయుచుండిరయ్య చేరదీసి జనుల
మన్నె బిడ్డ మాట మంచి బాట.
11ప్రభువు మనకు గలడు పథకాలు నడిపించ
కార్యవిధుల జూచు కార్యశీలి
కొలుచు వారి కెల్ల కొంగు బంగారము
మన్నె బిడ్డ మాట మంచి బాట
12అరయ నడవి తల్లి అనురాగవల్లిరా!
అంది పుచ్చుకొనుము అఖిల సుఖము
అడవి వృద్ధి చెంద అవని వర్ధిల్లురా!
మన్నె బిడ్డ మాట మంచి బాట
13. కోయదొరలు మరియు కొండ్రెడ్డి, వాల్లీకి
వన్నె లొలుకు దొరలు, మన్నె దొరలు
కలవు కొండకాపు, కమ్మర కులములు
మన్నె బిడ్డ మాట మంచి బాట
14 మాలొ లేనె లేరు మంగళ్ళు మరిజూడ
సిగల కొరకు జుట్టు సిరులు పెంచు
ఆది నుండి మాకు అంటదు క్షురకర్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట
15 అన్నదమ్ములవలె నన్నింట నుందుము
అడవి తల్లి మెడకు హార మల్లె
ఆది గురువు మాకు అడవి తల్లేనురా !
మన్నె బిడ్డ మాట మంచి. బాట
16 అడవి తల్లి బిడ్డలందరమ్మొక్కటే
లేదు భేష జమ్ము లేదు మాకు
చేయి చేయి కలిపి చేస్తాము పనులన్ని
మన్నె బిడ్డ మాట మంచి బాట
17 కాయకసరు లేరి కలిసి భుజించేము
వావి వరస తెలిసి పలుకుతాము
ఆదిజాతి మాది అన్నిజాతులలోన
మన్నె బిడ్డ మాట మంచి బాట
18 మతము కన్న మాకు మానత్వము మిన్న
పెద్దవారి మాట చద్దిమూట
కూలదోయమెపుడు కుల పెద్దమాటలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
19. మల్లె, సన్నజాజి, మందార, సంపెంగ
విరుల వంటి మనసు వెలుగు మాది
తేనెలొలుకు తేట తెలుగు భాషయెమాది
మన్నె బిడ్డ మాట మంచి బాట
20. అడవి తల్లి ఒడిన అల్లారు ముద్దుగా
ఆడిపాడినాము ఆదమరచి
అరమరికలు లేవుఅభ్యాసమున మాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
21. కొండ కోన మనకు అండగానుండగా
ఎండమావి కాదు కొండ బతుకు
గుండె నిబ్బరమును నిండుగా పెంచుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట
22. చదువు సంధ్యలన్ని చక్కగా నేర్చుకో
భయములేదు నీకు భావియందు
దేశ సేవ చేయ ధీరుడా లేలెమ్ము !
మన్నె బిడ్డ మాట మంచి బాట
23. మనిషి పుట్టి పెరిగి మట్టిలో కలియును
పుడమి తల్లి రుణము విడువ వద్దు
మనిషి జన్మ మనకు మరల కలదోలేదొ
మన్నె బిడ్డ మాట మంచి బాట
24.అలుపెరుగని పనులు సలుపుమాఎవ్వేళ
అమ్మనాన్నలందు ఆదరమును
మరువ వలదు ఎపుడు మనసు నందుంచుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట
25.పీకలోతు తాగి పీనుగుగామారి
భవిత వదిలి నీవు భంగపడకు
పచ్చనయిన బాట వెచ్చగా సాగిపో!
మన్నె బిడ్డ మాట మంచి బాట
26.ఉన్నదాన్ని బట్టి ఒడుపుగా మసలుకో
కోరరాని ఫలము కొంపముంచు
మర్మమెరిగి బ్రతుకు మలచుకో సాగిపో!
మన్నె బిడ్డ మాట మంచి బాట
27.చదువు లేనివాడు అదుపు తప్పునెపుడు
చదువ బడులు కలవు చక్కగాను
విద్యనేర్చినపుడె విజ్ఞానమబ్బురా!
మన్నె బిడ్డ మాట మంచి బాట
28. అడ్డు లేదు నీకు అవని యందెక్కడ
అలుగు వోలెపొమ్ము కలుగు జయము
భావి జీవనంబు బాగుగా వెలుగొందు
మన్నె బిడ్డ మాట మంచి బాట
29. చెట్లు చేమలందు చెలిమిని ఆశించు
కల్మషమ్ము లేని కార్మికులము
కాయకష్టమందు కలుగును ఫలితంబు
మన్నె బిడ్డ మాట మంచి బాట
30. గౌరవించుమయ్య ఘనముగ పెద్దలన్
తల్లిదండ్రి మాట తప్పవద్దు
గురువు గారి మాట సిరుల మూటే కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట.
31. అక్షరాలు రాని అన్యులందరికినీ
విద్య నేర్పవయ్య విధిగ నీవు
విద్య దారి చూపు విశ్వమందు నెపుడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
32. ఆత్మసాక్షి నెరిగి అన్నింట మసలుకో
కీడు చేయబోకు కీర్తి కొరకు
నీతి లేని వాడు కోతి కంటెను పాడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
33. చట్ట సభల యందు చక్కగా రాణించి
వెలుగు పంచవయ్య విశ్వమునకు
స్ఫూర్పి పొంది నీవు కీర్తి సంపాదించు
మన్నె బిడ్డ మాట మంచి బాట
34. నాయకత్వ లక్షణాలను నేర్చుకో
ప్రగతి వైపు వెళ్ళు పట్టు పెంచి
దూరమేమి కాదు చేరగా విజయమ్ము
మన్నె బిడ్డ మాట మంచి బాట
35. అడవి బుట్టినాము నరయనదృష్టాన
సారిరారు మనకు జగతి నెవరు
గొప్ప చరిత గలదు చెప్పు కొనగ మనకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
36. కొండవాడిననుచు కుంగిపోకెన్నడు
దుష్ట బుద్ది వాని దూషణలకు
కళ్ళు తెరచి నీవు కదము తొక్కవలెరా !
మన్నె బిడ్డ మాట మంచి బాట.
37. అడవి లోనె పుట్టె ఆదిమానవజాతి
గిరులలోనె పుట్టె “గిరిజ మాత”
అడవి తల్లి అండఅన్నిటా నీకుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట.
38. సురల నిలయమంత గిరుల పైనేకదా !
వెరువకయ్య నీవు గిరుల నుండ
గిరులె మనకు నిచ్చు సిరులు వేలకు వేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
39. మొరుగు శునక మెపుడు కరుచుననుట కల్ల
వదరు బోతువలెను వాగ వద్దు
మేలు జేసి చూపు మేటివై జనులకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
40. వటము చూడ భువిన పటువైనదైనను
గాలి వాన రాగ కూలి పోవు
ఎవరి తనువు చూడ ఎంత కాలము మన్ను
మన్నె బిడ్డ మాట మంచి బాట
41. సాంప్రదాయములను చక్కగా కాపాడు
వెర్రి మొర్రి కుర్ర వేష మేల ?
పదిల పరచుమయ్య ప్రాచీన సంస్కృతి
మన్నె బిడ్డ మాట మంచి బాట
42. కుల, మతాల గొడవ కూర్మిని తెగతెంచు
కులము కుళ్ళు కంపు కుదరదయ్య
మతము మత్తు మందు మర్చిపో మహిలోన
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏 ప్రాచీన వర్ణన 🙏
43. దబ్బగడ్డి కప్పు దలుసు మట్టితొ గోడ
అరుగు నల్ల మన్ను అటకపైన
పర్ణశాల వంటి పదిలమైనవి ఇళ్ళు
మన్నె బిడ్డ మాట మంచి బాట
44. గొప్ప అందమైన గోడ చిత్తర్లతో
సుద్ద, పసుపు, నలుపు సుడుల ముగ్గు
“గిరిజ”పనితనములు గీటు రాయిగ నిల్చు
మన్నె బిడ్డ మాట మంచి బాట
45. వంట ఇంట పొయ్యి, వెటసోక “జోలరి”
మట్టి కుండలోని మంచి నీళ్ళు
ఉట్టి మీద చట్టి, చట్టిలో అంబలి
మన్నె బిడ్డ మాట మంచి బాట
46. వెదురు తవ్వ, తట్ట, అదురు టొంపం, మీట
పొడుగు కాడ దోకి, పొట్టి గిద్ద
సొల్ప, దొప్ప, రేక, సొరకాయ దిప్పలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
47. చామ, కొర్ర, గంటె, ఆముదం, ఉలవలు
చోడి, కంది, పెసర,, జొన్న, నువ్వు
చిత్రమైన మన్య చిరుధాన్య సొగసులు
మన్నె బిడ్డ మాట మంచి బాట
48. గుమ్మడాకు కూర, గోమతంటే మాకు
చేమఆకు కూర, చిలక కూర
కాయగూర పువ్వు కంది గుగ్గిళ్ళును
మన్నె బిడ్డ మాట మంచి బాట
49. పనసతొనల కూర, మినపప్పు పులుసు
పుట్ట కొక్కు కూర, మొట్టలిగురు
మాడిటెంక చారు మన్య జనుల విందు
మన్నె బిడ్డ మాట మంచి బాట
50. ఈత పురుగు వంట, పాత బియ్యపు కూడు
కొండ గొర్రె వెంటి, కోడి కూర
వేట సాగినపుడు విందుగాదేమాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
51. వెదురు కొమ్ము కూర, అదిరిపోవు రుచులు
ఉలవ పప్పు చారు విలువ కలది
గొడ్డు గూర ఆకు వండగా వదలరు
మన్నె బిడ్డ మాట మంచి బాట
52. వైము, నార, తేగ, మాటుము దుంప
తింటె హాయి కలిగి తృప్తి కలుగు
అడవి దొరుకు దుంపలాహారమే మాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట
53. మాడి టెంక లబ్బి మెత్తగా కరిగించి
అడ్డ ఆకు మీద నద్ది కాల్చ
అదిరిపోవు రుచితొ అట్టు చేకూరును
మన్నె బిడ్డ మాట మంచి బాట
54. పనస పళ్ళ పారు పడిపోవు పిక్కలు
ఏరి తెచ్చి వార్చి ఎండబెట్టి
వానకాలమందు వండి తినుట హాయి
మన్నె బిడ్డ మాట మంచి బాట
55. ఉసిరి, ముషిణి, వేము, ఓషథి మూలికల్
పనస, నిమ్మ, కమల పండ్లు దొరుకు
వాటి నేరి తెచ్చి వర్తకునకు నమ్ము
మన్నె బిడ్డ మాట మంచి బాట
56. వేట లాడనాన్న వెంట అడవికెళ్ళి
అమ్మ కథల పాత్ర లందు జూస్తి
జంతు తతిని కాంచి సంతోషమొందితి
మన్నె బిడ్డ మాట మంచి బాట
57. ముక్కు కడ్డు బాస, ముంజేత మురుగులు
కాళ్ళకు కడియాలు, వేళ్ళ బటువు
మెడన పూసగొలుసు నడయాడు నందాలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
58. నగలు మేను దాల్చి నవ్వులు రువ్వుచు
కురుల విరులు దాల్చి కులుకు లొలుకు
మగువ సొగసు జూడ మరులు పుట్టు మదిన
మన్నె బిడ్డ మాట మంచి బాట
59. చెట్టు, రాయి, రప్ప, పుట్టలోని పురుగు
నీరు, నిప్పు, గాలి, నింగి, ధరణి
సూర్యచంద్రులుయును సురలుగా పూజించు
మన్నె బిడ్డ మాట మంచి బాట
60. అడవి సంపదంత ఆదాయమే నీకు
పనస పండ్లు, తేనె, పచ్చిపసుపు
కొన్ని వెతలు దీరు కొండచీపుర్లమ్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట
61. చింతపండు, పసుపు, శీకాయ దినుసులు
సంచులందు పేర్చి సంతజేర్చు
గోనెబరువు మోయి గోంటెడ్ల చిత్రాలు
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏గంగాలమ్మ పండుగ వేడుక🙏
62. ఆముదాలు తెచ్చి ఆదివారము నాడు
వండి నూనె తీయు వందనముగ
క్రొత్త దుత్త తెచ్చి వత్తిని వెలిగింత్రు
మన్నె బిడ్డ మాట మంచి బాట
63. వెల్లకుండ కేసి రెల్ల పూవులు కట్టి
పసుపు కుంకుమెట్టి పళ్ళనిత్రు
“మల్లొ మల్లొ”అనుచు మలిగంగిపాటతో
మన్నె బిడ్డ మాట మంచి బాట
64. దుత్త నెత్తి నుంచి కొత్త బట్టలు కట్టి
కన్నె పిల్లలంత కదులు తారు
ఇల్లు ఇల్లు దిరిగె ఇలవేల్పు గంగమ్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట
65. జంబటూయలందు అంబను ముందూపి
బూతు పాట పాడి పూజ జేత్రు
గౌరవింతురంత “గొరవ”పూజారిని
మన్నె బిడ్డ మాట మంచి బాట
66. గంగతల్లి కొరకు గంగమ్మ పండుగ
కోలటాట బసలొ కొంటె పాట
భూమితల్లి కొరకు భూదేవి పండుగ
మన్నె బిడ్డ మాట మంచి బాట
67. ఆకు కొమ్మ తెచ్చి అంగటలికి పెట్టి
నిండు కుండలోని నీళ్ళు దెచ్చి
కోడిపుంజుబట్టి కోసి బొట్టును పెట్టు
మన్నె బిడ్డ మాట మంచి బాట
68. మత్తు మాంస ములను చిత్తుగా భుజియించి
ఓయి పాట పాడు హాయి గాను
గంగదేవి కొరకు గంతులే వేసేను
మన్నె బిడ్డ మాట మంచి బాట
🙏 సంకురాతిరి పండుగ 🙏
69. సంకురాత్రి నాటి సందడే సందడి
భోగి తాన మాడి కాగి అగ్గి
పిలిచి దేవతలకు పెట్టు నైవేద్యము
మన్నె బిడ్డ మాట మంచి బాట
70. పశువు కొట్ట మంత పరిశుభ్రముగజేసి
పసుపు కుంకుమలతొ పాడి కొరకు
పూజ జేతురయ్య ముదముతో పల్లెలన్
మన్నె బిడ్డ మాట మంచి బాట
🙏🙏 ఆటలు 🙏🙏
71. పండు వెన్నెలందు పడుచులంతా జేరి
గొంతెనమ్ము లాడు గోలజేస్తు
ముక్కు గిల్లుడాట మక్కువైనది కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
72. కుయ్యి కుయ్యి కోడి కూత కుయ్యాలంటు
కూతలాట లాడు కొంటె గాళ్ళు
ఆట లాడ కుంటె ఆనందమే ముంది !
మన్నె బిడ్డ మాట మంచి బాట
🙏 వివాహ పద్ధతులు 🙏
73. కోలటాట బసలొ కొంటె పాటలు పాడి
యువత జతలు కట్టి ఉరుకు తారు
రాక్షసుల వివాహ రకమంటె ఇదియేను
మన్నె బిడ్డ మాట మంచి బాట
74. అమ్మ జాతరంటు అర్థరాత్రుల నందు
వధువు వరుస తెలిసి అదును చూసి
లాగి చేయి పట్ట లాగు లాటల పెళ్ళి
మన్నె బిడ్డ మాట మంచి బాట
75. నచ్చిన వరునెంచి నలుగురితో కల్సి
ఒట్టు పెట్టి కన్య “కోలి”నిచ్చి
సాంప్రదాయమైన చక్కనైనది పెళ్ళి
మన్నె బిడ్డ మాట మంచి బాట
76. “ఓలి”నిచ్చి చేయు ఒద్దికయిన పెళ్ళి
వెళ్ళ వద్దు వెర్రి వేలమునకు
కట్నకానుకెపుడు కాదు శాశ్వతములు
మన్నె బిడ్డ మాట మంచి బాట
77. వెరువ కయ్య నీవు వెనుకబడ్డావని
పట్టుదలను పెంచు ప్రగతి కలుగు
గొట్టి సభల యందు గొంతెత్తి మాట్లాడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
78. ఆశ్రమాన విద్య ఆరోగ్యమందించు
వసతులన్ని కలవు మసలు కొనగ
గిరిజనులను మేటి పురజనులను జేయ
మన్నె బిడ్డ మాట మంచి బాట
79. నాటి గురువు లంత ధీటైన గురువులు
లోటు లేని దమ్మ నాటి విద్య
కష్టపడితి నాడు కలిగె నేడు సుఖము
మన్నె బిడ్డ మాట మంచి బాట
80. పలక పట్టి మేము పాఠశాలకు వెళ్ళి
పంతులయ్య చెప్పు పాఠమంత
ఆలకింపులాయె ఆనాడు మాకెంతొ
మన్నె బిడ్డ మాట. మంచి బాట
81. ఆశ్రమాన మాకు అన్ని వసతులుండె
బట్టలిచ్చు, రేకు పెట్టె లిచ్చు
తలకు నూనె, సబ్బు తానమాడగ నిచ్చు
మన్నె బిడ్డ మాట. మంచి బాట
82. చాప, దుప్పటిచ్చి చక్కగా చూతురు
పుష్కలముగ నిత్రు పుస్తకాలు
విద్యతోడనెన్నొ విషయాలు బోధింత్రు
మన్నె బిడ్డ మాట మంచి బాట
83. మూడుపూట్ల తిండి ముచ్చటగా బెట్టి
బలము మందులిచ్చి బలిమి పెంచి
స్వీటు, పళ్ళు నిత్రు లోటు లేకుండగా
మన్నె బిడ్డ మాట మంచి బాట
84. పాఠశాల యందు పనిచేయ నుద్యోగ
బాధ్యతల విధులను పంచి ఇచ్చు
సక్రమముగ నీవు చరితార్ధుడవు కమ్ము
మన్నె బిడ్డ మాట. మంచి బాట
85. సమసమాజ రూపు సత్వరమే కల్గు
పల్లకుండ వద్దు పాడి గాదు
నీవు చేయు పనులు నిష్ఠగా చేయుము
మన్నె బిడ్డ మాట మంచి బాట
86. అతిపవిత్రముగద అధ్యాపకుని వృత్తి
అంకితమ్ము కమ్ము ఆత్మ సాక్షి
అన్ని వృత్తులకును ఆదర్శమది కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
87.అర్హతకలవారు అంశాలు బోధించ
వృద్ధి చెందగలదు విద్య విలువ
శిక్షణ కరువైన శిధిల మౌనుర విద్య
మన్నె బిడ్డ మాట మంచి బాట
88. ప్రజలు కొంత మంది పనులేమి దొరకక
విద్యబోధ చేయు విధుల జేరి
తప్పిదాలు చేసి తలవంపులగుచుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట
89. పాఠశాల విలువ పదిల పరచువారు
గురువులైన విద్య పరువు నిలుచు
గురువు లేని విద్య గుడ్డి విద్యరజూడ
మన్నె బిడ్డ మాట మంచి బాట
90. కొత్త విషయములను కోర్కెతో నేర్చుకో
మెదడు పదును చెందు మేటి గాను
విద్య లేని నాడు విలువేమి పెరుగురా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
91. తాగవద్దు పొగను, తల నున్నగా దువ్వు
బట్ట శుభ్రముంచి బడికి వెళ్ళు
పాదరక్ష వేసి ప్రగతి రక్షింపుమా! మన్నె బిడ్డ మాట మంచి బాట
92. సిగరు, జర్ధ, బీడి చెరచురా నీమేను
విడిచి పెట్టగవలె విధిగ నీవు
చెడ్డగుణము చూసి చెడిపోవు పిల్లలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
93. శాస్త్ర విషయమెల్ల చక్కగా తెలుసుకో
ఇంటిలోకి వచ్చు ఇంట్రనెట్టు
పల్లె పట్నమంత పాకింది ఈనెట్టు
మన్నె బిడ్డ మాట మంచి బాట
94. వార్తలెల్ల చదివి వర్ణంచి చెప్పాలి
విషయమంత తెలియు వివిధ గతుల
వార్తవలన జగతి వర్ధిల్లుచున్నది
మన్నె బిడ్డ మాట మంచి బాట
95. అర్ధగంట సేపు అభ్యాసమొనరించి
పావుగంటలోన ప్రశ్న నేర్పు
పిరికి తనము పోవు పిల్లలందరికిని
మన్నె బిడ్డ మాట మంచి బాట
96. సులువు తెలుసుకుంటె కొలువు పొందగవచ్చు
కొలువు పొందినపుడె కోర్కె తీరు
కోర్కె తీరినపుడె కొరత తీరును కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట
97. వెర్రి జతలు బట్టి వెలగాక తిరిగిన
బ్రతుకు కష్టమగును వెతలు కలుగు
మంచి దారి బట్టి మసలుకొనుట మేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
98. ఏడ్సు భూతమొచ్చి ఎందరినో జంపె
యుక్తి తెలుసుకోండి యువకులంత
జబ్బు వస్తె మందు జగతిలో లేదయ్య
మన్నె బిడ్డ మాట మంచి బాట
99. తిరుగు బోతువారి తీట తీర్చగవచ్చె
ఏడ్సు రోగమనెడు ఎండు తెగులు
మరిచిపోక మంచి మార్గమెంచుకొనుడు
మన్నె బిడ్డ మాట మంచి బాట
100.ఏకలవ్య ధీక్ష నెన్నుకొనుము నీవు
బీదవాడి ననుచు బిడియపడకు
కాంచి నేర్చుకొనుము కన్నప్ప పట్టును
మన్నె బిడ్డ మాట మంచి బాట
101.ఐ. టి. రంగమందు ఆదరణ కలదు
శాస్త్ర విద్య నేర్వ సౌఖ్యమయ్య
ఇంజనీరు విద్య నెంచకొనుట మేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట
102.గాలి వేగమైన కమ్యూనికేషన్లు
శీఘ్రగతిన జేరు చిట్టి కబురు
తంతిలేని ఫోన్ల వింతలను తెలుసుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట
103.సులభ మార్గమైన సుఖములున్నవినేడు
మేను అలవనట్టి, మేటి హాయి
శాస్త్ర విద్య యొక్క సౌఖ్యమే కద ఇదీ !
మన్నె బిడ్డ మాట మంచి బాట
104.కంప్యుటర్ల మహిమ కడురమ్యమైనది
కొద్దిలోనె తొలగు పెద్ద చిక్కు
సెకనులోనె పనులు చేసి చూపగ వచ్చు
మన్నె బిడ్డ మాట మంచి బాట
105.కల్లు చెట్ల చుట్టు కలిసి తిరుగుతారు
చుట్ట లడ్డ పొగను జుర్రుతారు
కాదు కూడదంటె కసురు కుంటారయ్య
మన్నె బిడ్డ మాట మంచి బాట
106.నమ్మి నారు అంటె నాన బోసేస్తారు
కసురు కుంటె మరల కానరారు
అడవి బిడ్డ మనసు ఆదర్శప్రాయము
మన్నె బిడ్డ మాట మంచి బాట
107.దిక్కుమొక్కు లేని దీనబాలురకైన
తిండి వసతి, బట్ట తృప్తిగాను
ఉచిత విద్య నేర్ప ఊరూర బడులుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట
108.జనులు అధికమైన పనులెట్లు దొరుకును
సంతు ఎక్కువైన వింత బాధ
ఒక్క బిడ్డ చాలు చక్కగా పెంచంగ
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏 సమాప్తం 🙏


కడబాలవారు, పద్య భాషలో మీరు మన్నెపు మాణిక్యం. మీ పద్యాలు మాకు నిజంగా మాకు పండుగ పిండివంటల్లా బహు పసందు కలిగించాయి.--- కాదంబరి శ్రీనివాస్
ReplyDeleteకడబాలవారు, పద్య భాషలో మీరు మన్నెపు మాణిక్యం. మీ పద్యాలు మాకు నిజంగా మాకు పండుగ పిండివంటల్లా బహు పసందు కలిగించాయి.--- కాదంబరి శ్రీనివాస్
ReplyDeleteసూపర్ సర్
ReplyDelete