Friday, February 5, 2016

మన్యసీమ శతకము

మన్యసీమ శతకము
🙏🙏💐💐🌿🌿💐💐🙏🙏

రచన  :కడబాల నాగేశ్వరరావు
ఉపాధ్యాయులు ,ఆశ్రమ ఉన్నత పాఠశాల 
ముసురు మిల్లి , రంప చోడవరం (మండలం) 
తూర్పు గోదావరి జిల్లా ,ఆంధ్రప్రదేశ్, పిన్ :533288
సెల్ నంబరు :7382356659


1.శ్రీలుపొంగు నట్టి సీమరా మన్యంబు 
వాగులున్న నేల వసుధయందు 
కొండ కోనలున్న నిండైన గిరిసీమ 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

2.చక్కదనము నుండు సౌధాలు లేవయ్య 
చల్లదనము నిచ్చు సౌఖ్యమిచ్చు 
యుల్లమందు నెపుడు చల్లని పవనాలు 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

3.ప్రకృతి కాంత తోడ బరవళ్ళుత్రొక్కుచు 
నాడుచుంద్రు జనులు హాయిగాను 
నాగరికతను విడిచి నయమైన బ్రతుకును 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

4.సాధువర్తనంబు సచ్ఛీలభావంబు 
నీదు సొమ్ము గాదె నిజము గాను 
స్వదు భాషణంబు చక్కని గమనము 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

5.ప్రకృతి చిత్రణంబు పరిణతి రూపంబు 
మూర్తి మత్వ మొందు ఆర్తి తోడ 
మందహాసమెపుడు చిందులు వేయంగ 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

6.మాటచూడ నీకు దేటగానుండును 
యాస కొంతయుండు బాసయందు 
యాస యున్న నేమి? మోసంబు లేదుగా 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

7.నీదురూపు చూడ నిక్కమైనదిరూపు 
కొండవాడుఅంటె కుంగి పోకు 
కొండ వాడనంగ కొండౌన బండౌన 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

8.కొండవాడనుచును గుటిలాన ప్రజలెల్ల 
పల్కగానె నీదు పాపమెల్ల 
తొలగిపోవునయ్య తొందరలోననే 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

9.కొండవాగులందు మొండిగా బ్రతుకుచు 
వేటలాడు నట్టి వీరుడవుగ 
దుష్టజంతుతతిని తుదముట్ట నేతెంచు 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

10.తొల్లి నుండి చదువు తల్లి  నెరుగలేదు 
ముళ్ల కంచెలున్న పొదలయందు 
సంచరించునట్టి సంచారజీవుడా ! 
మన్యసీమ లోని మాణ్యచరిత!

11) తొల్లినుండి ప్రభుత తోరంబునా నీకు
నేమి చేయలేదు? ఏది లేదు! 
ఏకలవ్య రీతి ఏకాకి వైనావు! 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

12) ఏమి చేయలేదు ఎవ్వారు చూడరు
కంచెలందు ముళ్ళ కంపవోలె
నిలిచి యున్న నేమి? నీకీర్తి తగ్గదు
మన్యసీమ లోని మాణ్యచరిత. 

13) పువ్వునుండి భ్రమరి ముదముతో మధువును
తేనెపట్టులందు తేర్చి నింపు
అట్టి తేనె పట్టు లానంద మేనోయి
మన్యసీమ లోని మాణ్యచరిత

14) అడవి లోన నీవు ఆనందమొందుచు
అడవి ఫలములన్ని అనుభవించి
స్వేచ్ఛ తిరిగెదీవు స్థిరమైన బ్రతుకుతో
మన్యసీమ లోని మాణ్యచరిత

15) దుష్ట జంతువనుచు దూరంబుగా జనుల్
పారిపోవు చుంద్రు వనములోన
దుష్టజంతు కోటికిష్టంబు నీవెగా. 
మన్యసీమ లోని మాణ్యచరిత. 

16) మంచి వానిఁజూచి మర్యాద వర్తించు
సహజవైరముడిగి సంచరించు
వనములోననున్న ప్రాణులెల్లప్పుడు
మన్యసీమలోని మాణ్యచరిత. 

17) దారి గాచి జనులు దయవీడి చంపుచుఁ
బెరిగె “బోయ”యొకడు గిరులయందు
సత్యభావమెరిగి సద్భావమబ్బెను
మన్యసీమ లోని మాణ్యచరిత

18) కొండకోనలందు బండబ్రతుకుమాది
చెట్లనీడలందు చెత్త మేము
తల్లడిల్లవద్దు తాపందు వీడుమా 
మన్యసీమలోని మాణ్యచరిత. 

19) అడవి లోనఁబుట్టి అడవిలోఁదిరుగుచు
నడవియందు ప్రాణమంతరించు
ననుచు దిగులు మాని ఆనందమొందుమా
మన్యసీమలోని మాణ్యచరిత

20) అడవిలోనఁబుట్ట నన్యాయమే గాదు
అడవిలోనఁబెరుగ నెడమ కాదు
అడవిలోనఁదిరుగ నౌన్నత్యమబ్బును
మన్యసీమలోని మాణ్యచరిత. 

21) చెట్టుపుట్టలందుఁజెంగున నెగురుచు
నున్న లేడిపిల్ల మిన్నగాను
నీదు చెలిమినెపుడు నిత్యంబు కోరును
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

22) చెట్టుపుట్టలందుఁ జెదపుర్గు భక్షించి
వృక్షశాఖ లెక్కు పెద్ద ఎలుగు
మిమ్ముఁజూడగానె మేనటుత్రిప్పును
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

23) అడవి లోన మదిని ఆనందభావాన
పురిని విప్పి నెమలి ముదము నాడు
నెమలివోలె నీవు నిండైన వాడవు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

24) అడవిలోన తిరిగి అట్టహాసమ్మును
జేయుచుండు పులియు స్థిరముగాను
పులికి జంకవెపుడు తలపులోధైర్యంబు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

25) అడవి సంచరించు గడుసైన జంతువుల్
వనములోనఁదిరుగు పక్షులెల్ల
మీకు చెల్మిగాదె మిక్కుటంబుగఁజూడ
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

26) అడవిలోన దొరుకుఆహారసంపదల్
కొదువగాదు నీకు కొలచి చూడ
వనమునందునున్న ఘనమైన ఓషధుల్
మన్యసీమ లోని మాణ్యచరిత.! 

27) వానకాలమందు వరుణమూర్తిని గొల్చి
పూజఁజేతురంత ముదముగాను
వర్షకాల హేతు ఫలము కొల్వగ మేము
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

28) ఘనతకెక్క మేము గంగను కొల్తుము 
నాడుచుందుమయ్య హాయిగాను
గంగ కొలచి మేము రంగాన నర్తింతు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

29) ఎన్ని యుగములయిన ఎన్ని కష్టములైన
నోర్చుకొందుమయ్య నోరు విడక
“పెద్ద”మాటనెపుడు వినయాన పాలింతు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

30) ఎంత దూరమైన సుంతైన కష్టంబు
తలచకుండ మేము ధైర్యమలర
నడచుచుందు భువిని నాందబు చేయుచు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

31) ఆదికాలమందు వేదసంతతి మేము
ఎరుగమయ్య మదిన ఎడమలేదు
సరసమైన బాణి జానపదులమేము
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

32) పెళ్ళివేళలందుఁ బెద్దగా వేడుకల్
సలపుకొందుమయ్య చక్కగాను
తలకుకొమ్ములుంచి వలపు నాట్యాలతో
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

33) వియ్యమందు వేళ వితైన వేడుక
ఎగిరి చేతుమయ్య హితము గాను
తాడి చెట్ల కల్లు దండిగాఁద్రాగుచు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

34)రేయి పగలు మేము రేలయో రేలంచు
పాట పాడు తాము భావమలర
గ్రామమందునున్న ఘనమైన పెద్దల్తొ
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

35) మనమునందుఁజూడ మాలిన్యమే లేదు
మాటలందు మాకు సాటి లేదు
తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

36) కొండమాటులందు నిండైన మనసున్న
జీవి తంబు మాది, జీవనంబు
మారు రూపు మాది మర్యాద మించిన
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

37) దొంగతనము లేదు దొరతనమునులేదు
మంకుతనము లేదు మహిన మాకు
వాక్కు నందు ఫలము వశ్యమైయుండును
మన్యసీమ లోను మాణ్యచరిత! 

38) ఏమి పాప ఫలమొ ? ఏమి శాప ఫలమొ ? 
వనము నందు మేము మునుల వోలె
మూగవోలె నున్న మోదంబు విడువము
మన్యసీమ లోని మాణ్యచరిత! 

39) కొండలందు పుట్టి బండలందుపెరిగి
పొంగు చున్న వాగు వోలె మేము
శుద్ధమనముకల్గి శుద్ధగిరిజనులం
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

40) రివ్వు రివ్వు నెగురు గువ్వబోలిక మాది
సాగిపోదు మెపుడు సత్వబుద్ధిఁ
ఐక్యమత్య గుణము ఆవశ్యకంమాకు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

41) కుటిలబుద్ధి తోడఁ గొండసంపద దోచి
హానిచేసి నారు ఆంగ్లజనులు
వారికెదురు నిల్చి వనమును గాపాడు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

42) దుష్టభావమరల దోపిడీ చేయుచు
నెత్తి కెక్కి నారు మత్త జనులు
అట్టి మత్త జనుల గట్టిగా నెదిరించు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

43) మన్యమందు జనుల మానంబు దోచుచు
నిష్టరీతి దొరలు ఏలుచుండ
సింహరీతి “రాజు”సింహనాదముజేసె
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

44) ఆంగ్ల పాలనమున హాయిలేకను మేము
కష్టమొంది నాము కానలందు
నారణాలకూలి కారుడబ్బులులిచ్చె
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

45) సీమనుండి ధనము చేతపట్టుకువచ్చి
కొట్టు పెట్టి మమ్ము కొల్ల గొట్టి
కుటిల బుద్ధి జనులు కుళ్ళుఆంగ్లేయులు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

46) ఎన్ని దినము లైన ఎన్ని యుగములైన
వాస్తవమ్ము కనుము వసుథయందు
కొండకోనలందు నిండు బతుకు మాది
మన్యసీమ లోని మాణ్యచరిత! 

47) కోయ, మన్నె, చెంచు కొండకమ్మరయంచు
కొండదొరలు ఎరుక కొండరెడ్లు
వివిధ జాతులున్న వేరేది లేదన్న
మన్యసీమ లోని మాణ్యచరిత! 

48) ఆంగ్ల జనులు మాకు హాయినిఁబోగొట్టె
శాసనంబుఁజేయ శాంత మొంది
ఎన్ని బాధలయిన నింపుగా సహియించె
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

49) తేనె పట్టులందుఁ దేనెనంతను గ్రోలి
చెట్లఫలములన్ని సేకరించి
వన్యఫలము చేత ధన్యుండవైనావు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

50) మబ్బుమొగిలుఁజూసి యుబ్బిపొంగుచు నెమ్మి
పురిని విప్పి యాడు ముదము గాను
అట్టి దృష్యఁమాది ఆనంద భావానఁ
మన్యసీమ లోని మాణ్యచరిత! 

51) ఘనత చెంది నట్టి గాముగంటందొర
మల్లుదొరల పేర్లు మరువమెపుడు
వారివోలె దేశభక్తితో నిలిచెదం
మన్యసీమ లోని మాణ్యచరిత! 

52) దొరల పెత్తనంబు తురగంబువలె సాగ
బారతంత్య్రమొందె భరత భూమి
కొండ లందు మాకు గుండెలుప్పెంగురా! 
మన్యసీమ లోని మాణ్యచరిత! 

53) దైవదత్త మయిన తరులసంపదనెల్ల
కొల్లగొల్లనారు తెల్లదొరలు
వనములోనఁ బుట్టి వనమురక్షింపుమా
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

54) రామరాజు తోడ రాజ్యంబు నెలకొల్పి
తెల్లదొరల కెదురు తిరిగి నావు
వన్యప్రాంతమంత స్వాతంత్ర్యముప్పొంగ
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

55) నాది నాది యంచు నాదంబు చేయుచు
దేశమందు స్వేచ్ఛఁదెలిపినావు
ఆంగ్లవైరి శౌరి అల్లూరి బాటలో
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

56) తెలుగు పౌరుషంబు తేజంబు మనదేను
వెలుగు లీను మనకు జిలుగులెల్ల
దేశదాస్య ముక్తి దీతైన అనురక్తి
మన్యసీమ లోని మాణ్యచరిత! 

57) ఎవరు వాడు ? దొంగఎటనుండి యిటువచ్చె ? 
కొండ బలము దోచు దుండ గీడు
తగినశాస్తి చేసి తరిమెదననె “రాజు”
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

58) వెదురు పొదలనుండి వెదురునరికితెచ్చి
దడులనల్లు తావు దట్టముగను
తేనెపట్టునున్నఁదేనెను తెత్తువు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

59) ఉదయమందు నీవు ముదముగా చెట్లెక్కి
కల్లు గీస్తవయ్య మెల్లగాను
చల్లదనముతోడ నిల్లిల్లుతిరిగుతూ
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

60) ప్రకృతి కాంత ముద్దుపట్టివి  నీవోయి! 
అడవితల్లి నీకు నమ్మ గాదె ! 
వనములోనఁబెరుగు ఘనమైన జీవుడా! 
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

61) కొండ జనుల భవిత కొరగాక నుండగ
విద్యనేర్పఁదలచి వివిధగతుల
ప్రభుత “బడులు”పెట్టె ప్రతిపల్లె వెలుగొందె
మన్యసీమ లోని మాణ్యచరిత.! 

62) చదువు చెప్పుటకును సౌధాలు నిర్మించె
ఖర్చు పెట్టి నారు ఘనముగాను
సౌధమందచదువ సౌఖ్యాలు కల్పించె
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

63) చదువు నేర్ప గొప్ప సాహిత్య వేత్తలు
గణితశాస్త్రబుధుల గణితమతులు
హిందిపండితాళి ముందుగా వత్తురు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

64) చదువుకొనగ మనకు చక్కని బడులుండె
పండితుండవగుదు ప్రతిభ కలుగు
చదువులేక యున్న సంస్కార ముండదు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

65) చదువు కున్న మనకు సాహిత్యమబ్బును
చదువు కున్న మనకు సఫలతగును
చదువులేక పోతె చాలా కఠినమోయి
మన్యసీమ లోని మాణ్యచరిత! 

66) చదువు లేక కొండజాతికిఁ చెందిన
పురుషుడొకడు “దొంగ బుద్ధిఁ”బెరిగి
నట్టివాడె చదివి దిట్టయై “సుకవియై”
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

67) రామమంత్ర జపము రమణీయ ఫణితితో
జేయగానె యొకడు సిద్ధుడయ్యె 
నట్టివాడె జగతి “నాదికవిగ”మారె
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

68) ఆంధ్రరాష్ట్రమందు నాదిలాబాదులో
“కుమర భీము”యనెడు కొండబిడ్డ
జాతిపౌరుషమును నీతితోనిలిపెను
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

69) కుమర భీము కథలు కువలయమున నేడు
చలన చిత్రముగను జక్కఁదీసి
యాదరించి నారు మోదాన అందరు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

70) ఆశ్రమంబువలెను హాయిగా నుండెడుఁ
బాఠశాలలోనఁ బాఠములను
జక్కగాను జదువ మక్కువ చూపుమా
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

71) పాఠశాలలందు భక్తితో పాఠాలు
చదువవయ్య నీకు ముదముకలుగు
గురువు నెడల భక్తి గుణము వీడకు యెప్డు 
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

72) భోజనంబు మరియు పుత్తకమ్ములనిత్రు
విద్యనేర్పు నట్టి “వినయ శాల”
విద్యలోనె గాదు వినయమ్ము పెరుగును
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

73) కల్ల మాట లాడి మెల్లగా దరిచేరి
పాడు చేతురయ్య పలువలెల్ల
పలువ మాట వినకు పాడగు చిత్తంబు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

74) అందరొక్కటయిన ఐకమత్యము కల్గు
అందరొక్కటయిన హాయికలుగు
ఐకమత్యమున్న అవనిలో లోటేది ? 
మన్యసీమ లోని. మాణ్యచరిత! 

75) ఉదయమందు మనము ముదముగా పొలమున
కష్టపడుదు మయ్య ఖరము రీతి
కష్టపడుట లోనె తుష్టి కలదటంచు
మన్యసీమ లోని మాణ్యచరిత !    

76) రాత్రి వేళలందు రమణీయ నృత్యాలు
చేతు మయ్య మేము చేతులల్లి
పగలు మేము పడ్డ బాధలు మరువంగ
మన్యసీమ లోని మాణ్యచరిత! 

77) నాగరికత కలదు నవ్యమైనది రీతి
హాని చేయు తలపు అసలు లేదు
సత్వ గుణము మాది సద్భావ మగురీతి
మన్యసీమ లోని మాణ్యచరిత!

78) మన్య ప్రాంత మందు మర్యాద కలదండి 
ఆశ లేదు మాకు లేశ మైన
వర్తకాళి వచ్చి  వైర భావముపెంచె
మన్యసీమ లోని మాణ్యచరిత !  

79) వర్తకాళి వచ్చి వసుకాంక్షఁజూపించి
పాడుచేసినారు వర్తకమును
వర్తకాళి కాదు నర్తన మశకాలు
మన్యసీమ లోని మాణ్యచరిత !  

80) కపట బుద్ధి వారు కష్టాలు కల్పింత్రు
తిరుగు లేదు మాకు బెరుకు లేదు
మంచివాని కెపుడు మహిలోన విజయంబు
మన్యసీమ లోని మాణ్యచరిత.!

81) మనల వృద్ధిఁజేయ మంచిపనులు నేర్ప
భువిని వెలసెనయ్య పుణ్యరీతి 
గిరిజనాభివృద్ధి గిరిజనులకు సంస్థ
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

82) పరిథి పెంచి నారు పథకాలు రచియించి
బుుణము లిచ్చి నారు దినము గడవ
బీదతనము బాపి మోదంబు కల్పించె
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

83) బండలందు పారు వాగులన్నింటిపై
చెక్కుడాములెన్నొ పెక్కుకట్టి
రూప కల్పనంబు రూఢిగాఁజేసారు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

84) పట్టుపురుగులెల్ల దిట్టగాఁబెరుగంగ
శిక్షణంబు నిచ్చి  స్థిరము గాను
చెంత నిల్చినారు “సెరికల్చరీ ”వారు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

85) కొండపోడులందు బండసేద్యము చేసి
శ్రమను బొందినాము క్రమము లేక
కొండ సేద్యమేమి?  నిండునా మన కుక్షి
మన్యసీమ లోని మాణ్యచరిత! 

86) మన్య ప్రాంత మంత మామిడి తోటలు
విస్తరింప “ప్రభుత” పెద్దగాను
మావి మొక్కలిచ్చి మన్యంబు జనులకు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

87) పల్లె పల్లె లందు పాఠశాలలు పెట్టి
వెలుగు నింపి నారు విద్య నేర్పి
అక్షరములు నేర్చి అభివృద్ధి చెందగ
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

88) బీడుభూములందు జీడి తోటలు పెంచి
బాగుచేసినారు వాగులన్ని
పాడి పంట పెరిగి ప్రగతి సాధించాము
మన్యసీమ లోని మాణ్యచరిత! 

89) రాత్రి వేళలందు రాత్రి బడులు పెట్టి 
చదువు చెప్పి నారు చక్కగాను
పగలు పనులు చేసి పాఠాలు చదవండి
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

90) సాధుజీవనంబు సత్యంపు మార్గము
సత్వగుణము కలిగి సాగి పొమ్ము
నీకు నెదురు లేదు నిత్యంబు సాగిపో
మన్యసీమ లోని మాణ్యచరిత! 

91) శబరకులమునందు జన్మంబు పొందిన
భక్తురాలు “శబరి” ముక్తిఁ బొందె
రంజనంబు గాదె రామదర్శన మెప్డు
మన్యసీమ లోని మాణ్యచరిత!   

92) శబరి భక్తి తోడ శ్రద్ధగా నెంగిలి
ఫలములిచ్చి ముక్తి ఫలముఁ బొందె 
మనమునందు భక్తి మంత్రంబు ముఖ్యంబు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

93) చక్కగాను మనకు సదుపాయములు సేసి
గిరిజనాభివృద్ధి జరుప దలచి
ఆదరించినారు అధికారబృందంబు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

94) అనుభవింపు డయ్య అడవి సంపద నెల్ల
దైవదత్త మయిన తరువు ఫలము
అడవి సంప దంత అన్యులదేఁకాదు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

95) కుటిలబుద్ధి నుండు జటిలమనస్కుల
దరికి జేర బోకు పరిధి దాటి
గుటిలబుద్ధి ఎట్లు కువలయంబున నిల్చు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

96) ఎండలోనఁ జేతి కండలు కరుగంగఁ
చెట్లు కొట్టెదీవు చేవ తోడ
కండ కలదు నీకు గుండెకలదు నీకు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

97) సామ్యవాదముడిగి సాధు మార్గము లేక
సంచరించిరయ్య జనులు నేడు
అట్టి మార్గ మీవు గట్టిగా నెదిరించు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

98) సామ్యవాదమున్న చక్కగా భువిలోన
సకల సిద్ధి కలుగు సత్యమిదియె
ఉగ్రవాద శబ్ద ముల్లమందునఁవద్దు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

99) ఎన్ని దినములయిన ఎన్ని కష్టములైన
మంచి విజయమందు మహినిఁజూడ
మానవత్వమనెడు మార్గాన పయనించు
మన్యసీమ లోని మాణ్యచరిత ! 

100 అడవితల్లి యొక్క కడుపు పంట నీవు
అడవితల్లి యొక్క నమృతమీవు
అడవితల్లి కెపుడు నానందమొసగుమా
మన్యసీమ లోని మాణ్యచరిత! 

101పాఠశాలలందు బాలబాలికలెల్ల
శతకపద్యములను జదవవలయు
గిరిజనుల వెతలకు గీటురా ఇది నేడు
మన్యసీమ లోని మాణ్యచరిత! 

            సమాప్తము
    ఓం శాంతిః  ఓం శాంతిః  ఓం శాంతిః


Kadabala Nageswara Rao
Teacher
Govt Tribal welfare High School
Musurumilli
Rampa Chodavaram (M)
East Godavari District
A.P,Pin:533288



Monday, January 18, 2016

కడబాల కవితల మాల

అయుత కవితా యజ్ఞం
సహస్రకవి సంఖ్య : 244
కవి పేరు: కడబాల నాగేశ్వర రావు
కవిత సంఖ్య: 16
శీర్షిక:   శ్రీ సూక్తము
“కరుణ శ్రీ”“జంథ్యాల పాపయ్య శాస్త్రి”గారి స్వయాన మనవడు “శ్రీ చింతపల్లి నరసింహారావు”గారు ఎం. ఎ తెలుగు పండిట్ (విశ్రాంత ఉపాధ్యాయులు)నా గిరిజన శతకము పై వ్రాసిన ఆశీస్సులు.

❶ ఆటవెలది.
అడవిలోన పుట్టి ఆదికావ్యము వ్రాసి
భరత జాతి ఖ్యాతి వసుధలోన
భద్ర పరచి నట్టి “వాల్మీకి”కడబాల
కవిని గాచు గాక ! కావ్యసిరుల.!

❷ కందము
చక్కని మీ శతకంబును
మక్కువ తోచదివితి సదమల భావమ్ముల్
పెక్కు గలవు శతకంబున
నిక్కమయిన “సహజ కవి”గ నిలిచితివయ్యా !

❸ కందము
పొత్తము చిన్నది యైనను
మెత్తని మీ భావములకు మెరుగులు దిద్దెన్
అత్తరు పూసిన విధముగ
మొత్తము పద్యంబులన్ని మోదము గూర్చెన్ !

❹ ఆటవెలది
అడవి తల్లి ఒడిన అల్లారు ముద్దుగా
ఆడిపాడినట్టి అనుభవముతొ
వ్రాసినట్టి మీదు రమణీయ శతకంబు
ఉండు గాక ! అడవులుండుదాక !

❺ ఆటవెలది
అవని కల్పవల్లి యడవి తల్లి యనుగు
పుత్రుడితడు ప్రేమ పాత్రుడితడు
వినయశీలి, పద్యవిద్యలో ధీశాలి
వాణి వలచినట్టి భాగ్యశాలి.!

❻ కందము
కడబాల వారి ఈ కృతి
కడురమ్యంబై, సతతము కమనీయంబై,
అడవికి ఆభరణంబై,
పుడమిన ఎనలేని కీర్తి పొందగ వలయున్ .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Kadabala Nageswara Rao
Teacher.
Musurumilli.
Rampa Chodavaram(M)
E. G. DT, A. P :533288
Cell : 7382356659

        🙏 మేనక ఉద్భోద 🙏

వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని  వరుని గా నువ్వు కోరుకోకు.
మూడు కన్నుల వాడు ముక్కోపి మృగధరుడు
భష్మాంగధారుడు, భయం కరాకుడు! వలదు  వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు


ఇంటింట తిరిగేటి భిక్షగాడేనతడు
మెడచుట్టూ నాగులే ఆభరణాలు
పుర్రె లోనే  భిక్ష శుద్ధి లేదతనికి
వీధుల్లో తరిగేటి జంగమయ్యేఅతను వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు

నడి నెత్తిమీదేమొ నట్యమాడే గంగమ్మ, శశిధరుడు
కాటికాపరి వాడు పుర్రె లేహారాలు నివాసమేలేని నిత్య దరిద్రుడే వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు

శ్రీ ని కంఠమందుశిరిగాను దాల్చిన వన్నె లేలేనట్టినిర్విరాకారుడే
త్రిశూలధారుడే, త్రినేత్రరూపుడే
పిచ్చి నాట్యం ఆడే నాటునటుడే తల్లి వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు



కడబాల నాగేశ్వరరావు
సహస్ర కవి సంఖ్య  :244
అయుత  కవితా యజ్ఞం
దివి :07--01--2016
కవిత నెంబరు ---  9
అంశం  -  ఈత
శీర్షిక  -లంక మేత గోదారి ఈత

ఎప్పుడూ నా కడుపు ఖాళీనే
ఎందుకంటే నా పరిస్థితి "లంక మేత గోదావరి ఈత

నక్క పరిస్థితే నా దెప్పుడూ
నక నక లాడే టప్పుడు పోతే నకలాడుతు తిరిగి వస్తా

నా దొక్కనిదే కాదు సుమా !
నా తోపాటుగ వచ్చేనా సహచరులందరిదీ

క్రోసుల దూరం మా ప్రయాణం
కంగారు పడుతూ గడ్డి కతకడం చుట్టలు చుట్టీ సంచీ  నింపడం

కాపలా దారు కరుణ  చూపితే
కొంత సేపు నెమరు వేయడం, విశ్రమించడం కనుకుతీయడం

పొద్దు గుంకితే ఇంటి ప్రయాణం
గోదారి మద్యలో ఈత కొట్టడం, తిన్నది అంతా మటుమాయం

పశువుగ పుట్టిన ఫలితమే ఇది
కనుచూపుమేర కనబడదెక్కడ గడ్డి పరక రోడ్ల ప్రక్కన చిత్తుకాగితం తప్ప.

అందుకే మాబ్రతుకు ఇలా తగలడింది
మేము పాడిపశువులం పాడిగేదెలం అందుకే మాబ్రతుకు లంక మేత గోదారి ఈత.

                                                                                                                                                        సెల్  :7382356659
సహస్ర కవి సంఖ్య :244
పేరు :కడబాల నాగేశ్వరరావు
గ్రామం :ముసురు మిల్లి
రంప చోడవరం(మండలం)
తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్, పిన్ :533288
🙏అయుత కవితా యజ్ఞం🙏

   ఇంజెక్షన్   సూదిగాడు

మాయదారి సూదిగాడు
మాటువేసి ఉంటాడు
పల్సర్ బండి మీన పదిలంగా వస్తాడు

ఒంటరి మహిళలను, బడికి పోవు చిన్నారులు, ముసలోల్లు టార్గెట్ గా
బండిదిగడు భయపడడు బండలాంటి గొల్లి గాడు
వెనక నుండి నేరుగాను సూదిగుచ్చి పోతాడు

సర్రు మని మంట రాగ పిర్ర చూసుకుంటారు
సూదిగుచ్చు కుంటుంది కర్తమేమొ కారుతుంది
లబోదిబోమంటారు ఆసుపత్రికి కెల్తారు
సూది ఆనవాళ్లు చూసి డాక్టరు సూదేస్తాడు

అల్లదిగో అక్కడ ఇల్లిదిగో ఇక్కడ
బడులకు బందులాయె
అతివలు పనులు మానె
ముదుసలి మంచం చేరె
గుండెల పిడికిట పట్టి ప్రజలంతా మూల్గుచుండె

పట్టుకున్న వారికి ప్రైజ్మనీ ప్రకటించే
ఐదులక్షల నగదుఅవార్డుగా ఇచ్చునని
వేలమంది పోలీసులు వెతుకు లాట మొదలాయె

క్షణ క్షణం ఉత్కంఠ అదిగో అక్కడ ఇల్లిదిగో ఇక్కడ
పైకమే సిద్ధ మాయె ప్రభుత్వం దిగివచ్చె

రోజులేమొ మారిపోయె సూదిగాడు దొరకడాయె
మాయదారి  సూదిగాడు  గాడు వాడు పెద్ద మోసగాడు
మరువద్దు మనిషి కాదు
వాడు పెద్ద కంత్రి గాడు.
 

7382356659
ఎస్ కె : 244
Kadabala Nageswar Rao musurummilli
E.G.Dt  : 533288

😱😱😂😭😂😱😱
🐥 పిచ్చుక కనుమరుగు🐥

తుర్రుమను పరుగులూ
కిచ్.... కిచ్..అరుపులూ
నిలబడదు    ఎక్కడా
నిమిషమైనా
ఆనంద తాండవం
అరుదెంచు
ఆహ్లాదం

ఒక దాని పై నొకటి
ఒలికించు ప్రేమలూ
పడుచు పిట్ట కొరకు
కుర్ర ఫైటింగులూ
కళ్ళకూ కనిపించు
కమనీయ దృష్యాలు.

మేడలు మిద్దెలు పూరిల్లు
గుళ్ళు గోపురాలు
వరి కుప్పల్లోను
పంట చేలల్లోను
క్రమశిక్షణ లేని
కవాతు సైనికులు.

గుంపులు గుంపులుగ
గిజుగాడి గూళ్ళు
సంతాన సాఫల్య కేంద్రాలు
ఈత, తాడి చెట్ల ఆకుచివర్లు
కరెంటు తీగలకు
వ్రేలాడు దృష్యాలు
వింత గొలుపు.

“సెల్ టవరు” రూపాన
రేడియేషన్ సోకి
వేలకొద్దీ ఇలన
నేల  కొరిగె
పని పట్టి వెదికి నా
అగుపించ వెచ్చటా

భూమి దున్నే రైతు
బాంధవులు అవి అపుడు
హాని చేసే క్రిముల
నేరి తినును
పైరు పచ్చల కవి
పసిడి నేస్తాలు

వరి కంకి పై వ్రాలి
సైగలే చేసేది
కోత కొచ్చిందని
కూత వేసేది
ఎగిరెగిరి ఎగిరెగిరి
గంతులే వేసేదు

మనుషులకు నేస్తాలు
మురి పించు పిచ్చుకలు
వెదజల్లు నూకలను
నేర్పుగా నేరుకొని
తిత్తు నిండు గాను
తినుడు తినుడే

అటువంటి నేస్తాలు
కను మరుగు లయ్యేను
సాంకేతిక అభివృద్ధి
శాస్త్ర మహిమ
కనబడుట లేదిపుడు
కాల మహిమ.

ఈ కవిత సహస్ర కవి సమ్మేళనం ద్వారా  తెలుగు వేదిక. నెట్ కి ఎంపికై నవంబరు 15వ తేదీ సంచిక లో పొందుపరచ బడినది.

                     ఇట్లు
            మీ కవి మిత్రుడు
       కడబాల నాగేశ్వర రావు
                 

     ...     నమస్తే      ...





కడబాల నాగేశ్వరరావు
సహస్ర కవి సంఖ్య  :244
అయుత  కవితా యజ్ఞం
దివి :07--01--2016
కవిత నెంబరు ---  9
అంశం  -  ఈత
శీర్షిక  -లంక మేత గోదారి ఈత

ఎప్పుడూ నా కడుపు ఖాళీనే
ఎందుకంటే నా పరిస్థితి "లంక మేత గోదావరి ఈత

నక్క పరిస్థితే నా దెప్పుడూ
నక నక లాడే టప్పుడు పోతే నకలాడుతు తిరిగి వస్తా

నా దొక్కనిదే కాదు సుమా !
నా తోపాటుగ వచ్చేనా సహచరులందరిదీ

క్రోసుల దూరం మా ప్రయాణం
కంగారు పడుతూ గడ్డి కతకడం చుట్టలు చుట్టీ సంచీ  నింపడం

కాపలా దారు కరుణ  చూపితే
కొంత సేపు నెమరు వేయడం, విశ్రమించడం కనుకుతీయడం

పొద్దు గుంకితే ఇంటి ప్రయాణం
గోదారి మద్యలో ఈత కొట్టడం, తిన్నది అంతా మటుమాయం

పశువుగ పుట్టిన ఫలితమే ఇది
కనుచూపుమేర కనబడదెక్కడ గడ్డి పరక రోడ్ల ప్రక్కన చిత్తుకాగితం తప్ప.

అందుకే మాబ్రతుకు ఇలా తగలడింది
మేము పాడిపశువులం పాడిగేదెలం అందుకే మాబ్రతుకు లంక మేత గోదారి ఈత.

Cell. :7382356659
S.K. :244
Kadabala Nageswar Rao musurummilli
Dt . 27-12-2015
కవిత సంఖ్య : 5
కవితాశీర్షిక : అయుత కవితా యజ్ఞం
కవిత:   🙏     ప్రతిభ     🙏

ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు
పాండిత్యాన్ని తలెత్త నివ్వరు పామరులు
అన్నారు.   డా : బోయి భీమన్న  బడుగు, దళిత జీవుల బ్రతుకు ఛైతన్య శీలి
“సాహెబ్”బోధనలు తలకెక్కించు కొని
గాంథీ భావాలు బ్రతుకుగా మార్చుకొని
అస్పృశ్యతను అవతలికి నెట్టాడు
అంటురోగమది కూడదని అన్నాడు
కలం ద్వారా తన గళం వినిపించాడు
పల్లెటూళ్ళే దేశ పట్టుకొమ్మన్నాడు.
కలం సాయంతో జనం కుళ్ళు కడిగేసాడు
“పాలేరు నాటకం” ప్రత్యక్ష నిదర్శనం
పేద, దళిత బిడ్డల వెట్టిని చెరి పేసాడు
పాఠశాలల చేరి పై చదువుల నమ్మారు
అత్యున్నత చదువుల అందలాలు పొందారు
అధములు పేదలు దళితులు
 “గుడిసెలు కాలి పోతున్నాయ్” రచనకు
అంథ్ర విశ్వ విద్యాలయం వారు అందిచారు సాహిత్య అవార్డు కళాప్రపూర్ణ బిరుదు కలిగిన వెంటనే డాక్టరేటు నిచ్చె దాని వెను వెంటనే
భరత దేశ మిచ్చె పద్మశ్రీ, పద్మభూశణ్ ప్రతిభ  చాటు కున్న  ప్రగతి నీది ఓ.. భీమన్న... డాక్టర్ .. బోయి భీమన్న......       🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


S:K:::244
Kadabala Nageswar Rao
👭👯🚶👬👭👯👯👫

             బాల్యం

నా బాల్యం ఆనందాల నిలయం
సుగంథాల పరిమళం
ఉయ్యాల పవళింపు జోలపాటల మేల్కొలుపు
భూచాడి కిస్తానని బెదిరింపు
అదొక అనందపు మైమరుపు
చిరునవ్వు నగుమోము
అమ్మ పిలుపు కొరకు ఆరాట
పోరాటం
పాల బువ్వ కలిపి గోరు ముద్దలు జేసి అమ్మ సంకనెక్కి
ఆరగించుట నాకుఆనందమానందమ్
నలుగుపెట్టే వేళ నాన్నమ్మ బొజ్జను తెగతన్ని వేయటం
ఎక్కెక్కి ఏడ్వడం చిందులే వేయడం
అభ్యంగ స్నానాన్ని ఆచరించే వేళ అమ్మకంకకుండ తుర్రుమని పరుగుల ఆటల పరుగులు
నుదుట పెద్ద బొట్టు, బుగ్గన దిష్టి చుక్క పాలబుగ్గలను ఆన్చి అమ్మ ఇచ్చే ముద్దు మథురం మథురం మథురాతి  మథురం
ఏకబిగి ఏడ్పు విని ఏయ్యిందోనని
ఉరుకులూ పరుగులూ అమ్మ కంగారులూ
ముద్దుల మామయ్య ముచ్చటగ ఎత్తుకొని హత్తుకొని మైమరిచి ఆనందపడు వేళ పక్క తడిపేస్తుంటె పగలబడి నవ్వులు
తప్పటడుగుల వేస్తు తడబడి పడిపోతె అయ్యో నాతండ్రి పడిపోతివా బిడ్డ పదిలమేనా.
అక్షరాభ్యాసమున నాన్న చేతిని
తాకి బియ్యం పై వ్రాసె బీజాక్షరాలను
మెప్పించి కొనిపించె వేలధరబొమ్మలు వేస్టుగాను
మళ్ళీ మళ్ళీ రాదు మరువలేని బాల్యం
                ఇట్లు
            మీకవి మిత్రుడు
       కడబాల నాగేశ్వర రావు


S.K. :: 244
Kadabala Nageswar Rao
Musurummilli

💐💐  జననం  💐💐

పూర్వ జన్మల పుణ్యఫలముగా  అమ్మ కడుపున అండరూపమున చేరునులే.
మలమూత్రమ్ముల కలిసి జీవుడు తొమ్మిది నెలలు గర్భమున నివాసముండునులే అమ్మ తిన్న ఆహారమునందలి సారమంత తాను తాగునులే
ఉమ్మనీటిలో ఊహలేకనే ఉండ చుట్టుకొని ఉండును లే
పూర్వజన్మలో చేసిన కార్యముల నూహించుకొని ఉండునులే
ఊర్ధ్వముఖముగా ఉదరము నుండి జన్మస్ధానమున చేరి
కెవ్వు మను కేకతో గతమంత మరచి శిశువు రూపమున ఇలన చేరు, సుకుమారమైనట్టి సృష్టి రహస్యంబిది మానవ జన్మంటె మాటలు కాదోయి మళ్ళి మళ్ళీ రాదు మరుజన్మ ఏమిటో.


    S.K: 244
Kadabala Nageswar Rao
Musurummilli
E.G.Dt. 533288
🐄🐄🐄🐄🐄🐄🐄   కష్టాల పాలైన కడుపేదరైతు
🐏🐏🐏🐏🐏🐏🐏🐏

సకలజీవుల క్షుద్బాద తక్షణమే తీర్చి ఆయుశ్శు నిలిపేది ఈ పేద రైతు
హలము చేతబట్టి పొలము లోతుగ దున్ని నారు వేస్తాడు
నీరు పెడతాడు, ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కష్టనష్టాలకు, కలుగు బాధలకోర్చి పైరు పచ్చల పెంచి ఎరువులు, క్రిమి సంహార మందులు గొప్పులు గోతులు తవ్వి పంటలను పెంచితే చేతికందే వేళ వర్షాలు మొదలయ్యె నోటి కందే మెతుకు నీళ్ళ పాలయ్యేను చేసిన అప్పులు చుక్కలను చూపించె అప్పుతీర్చుట కొరకు ఆలి పుస్తెలనమ్మె
దేశానికి వెన్నెముక తన ఇంట లేదు వంట
ఆరుగాలం కష్టపడ్డా అంబలికి కరువు
ఎదిగిన కూతురుని ఎవరికిచ్చి చేయ అంధకార మయ్యె నతని బ్రతుకు
ఆత్మహత్యే దిక్కు అంథకారమే బ్రతుకు కడకు కాటికి పోవు ఖర్మ వచ్చె.
         ..  . ఇట్లు
.     మీ కవి మిత్రుడు
  కడబాల నాగేశ్వర రావు
S.K. :244
Kadabala Nageswar Rao
Musurummilli
Rampa Chodavaram M
E.G.Dt.  533288
7382356659

😱😱  రైతు  😱😱

ఓహో రైతన్న     ఓహో రైతన్న
నేలనే ఏలాలి    లేవరా రైతన్న
మోటు పాటలు పాడి
ఏతాము తోడి
నాగటెడ్లన కట్టి
నేల రాపాడి
బంగారు పంటలను
పండించు రైతన్న
జీవచ్ఛవంలా
మిగిలినావేమన్న
భూమాత. బిడ్డడివి
దేశానికి వెన్నెముక
ఆకలన్న వారి
కడుపు నింపేటోడివి
నీకు కష్టం వస్తె
ఏ దిక్కు లేదాయె
పైరు వేసినప్పుడు
అనావృష్టి పరిస్థితి
పంట చేతికి వస్తె
అతివృష్టి వానలు
పంట చేతికి రాదు
అప్పు మిగులు చివరకు
ఎగతాళిగా మారె
నీ బ్రతుకు చివరకు
కనికరమే లేని
కష్టాల పాలాయె
మొఖము చూపించటకు
మొకమాట మయ్యేను
గాలిలో ప్రాణాలు
నిలువునొదిలెల్లావు
ఆలి బిడ్డలు ఇలన
అనాధ లయ్యేను
నిను బట్టి బ్రతికిన
మేమేమి కావాలి
రెక్కల కష్టాన్ని
నమ్మిన రైతన్న
భూమాత రుణాన్ని
వెంటనే తీర్చావ.
జై కిషానన్నారు
నీకు ఎసరుబెట్టారు
కళ్ళెదుట బాధలు
తరగని అప్పులు
ఉరికొయ్య చివరకు
పిలిచేది రమ్మని
అర్ధాంతరముగానె
తనువు చాలించావ.

ఓహో రైతన్న  ఓహో రైతన్న
నేలనే ఏలాలి లేవర రైతన్న
               


S:K:244
Kadabala Nageswar Rao
           G.T.W.A.H.School
            Musurummilli
Rampa Chodavaram(M)
East Godavari Dist.
A.P_533288
Cell:7382356659

🙏🙏   నేను సైతం   🙏🙏

అగ్గి పిడుగు అల్లూరి కి గొప్ప అనుచరులం
పీడిత ప్రజల ఆశాజ్యోతి కి చిన్న నాటి స్నేహితులం
మాట కరుకు మనస్సు తియ్యతేనియల తెలుపు
చూపు మెరుపు ఆత్మీయతానురాగాలకలగలుపు
నడక రౌథ్రం! నటరాజు పద థూళి రేణువులం
అడవి తల్లి బిడ్డలం వనదేవత వారసులం
అయినాము మేము సైతం గీర్వాణికి తోబుట్టువులం

స్వచ్ఛమైన గాలి మాది చెలమ నీటి ఊట త్రాగ
ప్రకృతి రమణీయతకు పదిలమైన చోటు మాది
కల్తీ కలవని భుక్తి కందమూలాల విందు
కుల, మతాలు లేవు కొద్ది గొప్ప తేడాలు లేవు
వావి వరస లెరిగి పిలుపు వడితప్పని పని తీరు
అయినాము మేము సైతం అమ్మ సరస్వతీ పుత్రులం

దశదిశలా వ్యాపించెను  ధరిత్రి పై మా కీర్తి
ఏకలవ్యుని ధీక్ష కన్నప్ప పట్టుదల
స్ఫూర్తి నింపెను మనమున నవచైతన్యపు బాట
రంగ మేదైనా సరే రాణించుటే మా లక్ష్యం
నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు అన్నదినైజం
అయినాము మేము సైతం అవనికి ముద్దు బిడ్డలం

చుక్కలు చూపించినారు తెల్లదొరలకు నాడు
రంప పితూరీ దారు రామచంద్రయ్య థ్వారబంధాల
లాగరాయి పితూరీకి నాంది గడుతూరి లింగన్న పడాల్
కిండ్ర, కిర్రాబు, లబ్బర్తి, లాగరాయి గ్రామ వాసి
గాము గంటన్నదొర, మల్లుదొరలు మావారే
కీర్తి కొరకు చేయలేదు క్లిష్టమైన తిరుగుబాట్లు
అయినాము మేము సైతం చరిత్ర కు వారసులం

కడబాల చిన్నయ్యను స్వాతంత్ర్య సమరయోధున్ని
కరడు కట్టిన నేరగాన్ని చేసి సంకెళ్ళతొ బంధించి
ఈడ్సుకు వెళ్ళినారు పిడిగ్రుద్దు గుద్ది నారు
అండమాను జైలు నందు అసువులు బాపె మాముత్తాత
కళ్ళనీళ్ళు సైతం కలిగెను ఈ గత చరితం
(మా ముత్తాత   కడబాల చిన్నయ్య గారి గుర్తుగా)
                       ఇట్లు
               మీ కవి మిత్రుడు
      కడబాల నాగేశ్వర రావు
                 .    టీచర్
             ముసురుమిల్లి
          రంపచోడవరం (మ)
            తూ. గో. జిల్లా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

                                                                                                                                                        సెల్  :7382356659
సహస్ర కవి సంఖ్య :244
పేరు :కడబాల నాగేశ్వరరావు
గ్రామం :ముసురు మిల్లి
రంప చోడవరం(మండలం)
తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్, పిన్ :533288
🙏అయుత కవితా యజ్ఞం🙏

   ఇంజెక్షన్   సూదిగాడు

మాయదారి సూదిగాడు
మాటువేసి ఉంటాడు
పల్సర్ బండి మీన పదిలంగా వస్తాడు

ఒంటరి మహిళలను, బడికి పోవు చిన్నారులు, ముసలోల్లు టార్గెట్ గా
బండిదిగడు భయపడడు బండలాంటి గొల్లి గాడు
వెనక నుండి నేరుగాను సూదిగుచ్చి పోతాడు

సర్రు మని మంట రాగ పిర్ర చూసుకుంటారు
సూదిగుచ్చు కుంటుంది కర్తమేమొ కారుతుంది
లబోదిబోమంటారు ఆసుపత్రికి కెల్తారు
సూది ఆనవాళ్లు చూసి డాక్టరు సూదేస్తాడు

అల్లదిగో అక్కడ ఇల్లిదిగో ఇక్కడ
బడులకు బందులాయె
అతివలు పనులు మానె
ముదుసలి మంచం చేరె
గుండెల పిడికిట పట్టి ప్రజలంతా మూల్గుచుండె

పట్టుకున్న వారికి ప్రైజ్మనీ ప్రకటించే
ఐదులక్షల నగదుఅవార్డుగా ఇచ్చునని
వేలమంది పోలీసులు వెతుకు లాట మొదలాయె

క్షణ క్షణం ఉత్కంఠ అదిగో అక్కడ ఇల్లిదిగో ఇక్కడ
పైకమే సిద్ధ మాయె ప్రభుత్వం దిగివచ్చె

రోజులేమొ మారిపోయె సూదిగాడు దొరకడాయె
మాయదారి  సూదిగాడు  గాడు వాడు పెద్ద మోసగాడు
మరువద్దు మనిషి కాదు
వాడు పెద్ద కంత్రి గాడు.
 

Kadabala Nageswara Rao
Teacher.
Musurumilli.
Rampa Chodavaram(M)
E. G. DT, A. P :533288
Cell : 7382356659

        🙏 మేనక ఉద్భోద 🙏

వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని  వరుని గా నువ్వు కోరుకోకు.
మూడు కన్నుల వాడు ముక్కోపి మృగధరుడు
భష్మాంగధారుడు, భయం కరాకుడు! వలదు  వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు


ఇంటింట తిరిగేటి భిక్షగాడేనతడు
మెడచుట్టూ నాగులే ఆభరణాలు
పుర్రె లోనే  భిక్ష శుద్ధి లేదతనికి
వీధుల్లో తరిగేటి జంగమయ్యేఅతను వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు

నడి నెత్తిమీదేమొ నట్యమాడే గంగమ్మ, శశిధరుడు
కాటికాపరి వాడు పుర్రె లేహారాలు నివాసమేలేని నిత్య దరిద్రుడే వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు

శ్రీ ని కంఠమందుశిరిగాను దాల్చిన వన్నె లేలేనట్టినిర్విరాకారుడే
త్రిశూలధారుడే, త్రినేత్రరూపుడే
పిచ్చి నాట్యం ఆడే నాటునటుడే తల్లి వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు



Cell. : 7382356659
Kadabala Nageswar Rao
Musurummilli
Rampa Chodavaram (M)
E.G.Dt.  533288.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

          సహస్ర కవులకు
            స్వాగత గీతం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పల్లవి:  సహస్ర కవి సమ్మేళనానికి స్వాగమూ సుస్వాగమూ:
కదలి రండి కవులంతా కలిసి సంతోషమూ బహు సంతోషమూ:
1 చరణం:  బుడి బుడి అడుగుల కవులు మొదలు కొని
వడి వడి కవితలు వ్రాయు కవులకు
కని విని ఎరుగని విడ్డూరం కవులకు కలిగెను గొప్పవరం “సహస్ర”
2చరణం: ఆకాశమె మన ఐక్య వేదికగ చరవాణీ మనఅమ్మదీవెనగ
కదలి రండి ఇది కళ్యాణం కమనీయం బహు రమణీయం “సహస్ర”
3చరణం: ముందు తరాలకు మార్గ దర్శముగ భావి పౌరులకు బంగరు బాటగ
ఎవరికి దక్కని అవకాశం కవులకు దక్కెను ఆనందం “సహస్ర”
4చరణం: ప్రతి మనిషీ ఒక కవినే నోయ్ కలల రూపమే కవిత కదా
కవితకు లేవు హద్దులూ కల్లలు కావీ పలుకులూ “సహస్ర”
5చరణం: చిత్రమైన కవి సమ్మేళనం సహస్ర కవులకు ఇది నిలయం
తప్పక పొందును కీర్తి పతాకం అబ్బుర మొందును అవని జనం “సహస్ర”
6చరణం: చదువుల రాణికి పట్టమిదీ కవులకు కలిగిన భాగ్యమిదీ
కదలి రండి మరి కవులంతా వైభోగం ఈ వైభవమూ “సహస్ర”
             (సహస్ర కవుల మొదటి సమావేశం సఫలం అయిన సందర్భం గా)
           . .     ఇట్లు
   ...... మీ కవి మిత్రుడు
         కడబాల నాగేశ్వర రావు
.           ముసురుమిల్లి
          తూర్పు గోదావరి జిల్లా.

     ధన్యవాదములతో......
S.K. :  244
Kadabala Nageswar Rao musurummilli
Rampa Chodavaram (M)
E.G.Dt.  533288.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
           తెలుగు కవుల
        హైక్ పండుగ గీతం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పల్లవి: హైక్ ద్వారా కవులకు కలిగిన సంబరం సంబరం
పాలు పంచు కోవాలి మన మందరం తెలుగు కవులందరం “హైక్”
1చరణం: వేయి మంది కవులతొ జరిగే సమ్మేళనం సమ్మేళనం
దశదిశలా చాటాలి కవి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
2చరణం: రవీంద్రుని సారధ్యంలో ఇతర కవుల సహకారంతో
తేనెలొలుకు తెలుగుకు జరిగే  కవి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
3చరణం: గిన్నిస్ బుక్ ఆశయమ్ము గా సకలకళా కాంతుల మయమై
చరవాణి సౌకర్యంతో విశ్వానికి వెలుగులు చిమ్మే ఈ సంబరం తెలుగు కవి సంబరం “హైక్”
4చరణం: నిన్న మొన్న కవులతొ కూడి చక్కని అంశాలను చేర్చి
తెలుగు భాస ఉనికికి జరిగే తొలి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
5చరణం: చిల్లిగవ్వ ఖర్చు కాదురా శార్వాణి చలువ చాలురా
కరుణ చూపు అమ్మకు జరిగే కవి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
6చరణం: వేలవేల కవితల గూర్చి వేయాలి అమ్మకు హారం అమ్మ ఇచ్చు సంపద కోసం ఈ సంబరం సహస్ర కవి సంబరం “హైక్”

                  ఇట్లు
             .  మీ కవి మిత్రుడు
       కడబాల నాగేశ్వర రావు


                 ధన్యవాదములతో..........
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S.K:244
Kadabala  Nageswar Rao
Teacher
G.T.W.A.H.School
Musurummilli
Rampa Chodavaram (M)
E.G.Dt,A.P,533288


🙏🙏  కన్నీటి కవిత  🙏🙏

కష్టాలు కష్టాలు కన్నీటి కష్టాలు
ఎడతెరిపి లేనట్టి వాన తెచ్చిన కష్టాలు
కొని తెచ్చుకున్నట్టి కొత్త కష్టాలు
మనుషులు చేసినట్టి మరి కొన్ని కష్టాలు
అతివృష్టి వర్షాల అనివార్య కష్టాలు
కడలి వలె కనబడే కష్టాల దృష్యాలు
హృదయాన నిలిపేను కన్నీటి కదలికలు
హుదూద్ తాకిడి మర్చిపోలేదింకనూ
వెంటనే వచ్చింది చెన్నపురి కష్టాలు
పది అడుగుల లోతు లో నీటి ప్రవాహము చూడ
కన్నెర్ర చేసిన విధి వంచితులమయ్యేము
కాబట్టి చేయందించాలి, సాయాలు చేయాలి చేతనైన.

               ఇట్లు
      మీ మిత్రులు
కె. నాగేశ్వర రావు



Kadabala Nageswara Rao
Cell. : 7382356659
Teacher
Govt.Tribal Welfare Ashram High School.
Musurumilli.
Rampa chodavaram. (M)
East Godavari Dtst.
A.P .Pin. :533288.
అయుత కవితా యజ్ఞం
కవి సంఖ్య: 244 కవితసంఖ్య: 19
కవిత  :   మన్నన
శీర్షిక    : మర్యాద  మన్నన

నాన్న పని మీద ఊరు వెళ్ళి నపుడు
పెదనాన్న , నాన్న కొరకు పని మీద మాఇంటికి రాగ.
అమ్మ నన్ను పిలుచి పెదనాన్న వస్తుండ్రు
వెళ్ళవద్దెచటకు, కాళ్ళకు నీళ్ళివ్వు
ఆసనంబేర్పచి ఆప్యాయతగ జూడు
అంతలో పెదనాన్న అరుగు మీదకు వచ్చె
చేత సేకుల సంచి బరువుగా కనిపించె
నను చూసి పెదనాన్న నవ్వుతూ
నాన్నఎటు పోయెరా అగుపించడెక్కడా
అరుదెంచె మాఅమ్మ తలుపువారగ చేరి
బాగున్నదా బావ మాఅక్క అనసూయ
పిల్లలంతా ఇపుడు క్షేమమే కదా
మర్యాద పలుకులు
పరదాల చాటున పలకరించేవారు
ఎదురుగా ఎప్పుడూ కనిపించుటెరుగరు
పలుకులు మన్నన, పనులన్ని మన్నన
పెద్దలంటే విలువ పిలుపులో మన్నన
కట్టు బొట్టూలోన కనబడు మన్నన
మన్నన మర్యాద మసలుకొనగనాడు
నేడు మన్నన లేదు మసలుతీరేవేరు
ఆప్యాయతల మద్య స్వార్థమే చేరింది
కుటుంబాల మద్య కుళ్ళునే పెంచింది
ఎవరిదారిన వారు తిరుగుళ్ళు మొదలాయె
భ్రష్ఠుపట్టెను నేడు ప్రతిచోట
మన్నన
మన్నన కరువాయె మర్చచె
జనులు నేడు.


    

Thursday, January 14, 2016

కడబాల " స్వీయచరిత్ర "


🙏🙏 స్వీయ చరిత 🙏🙏

❶ పోలమానుగొంది పూర్వీకులూరున
అయ్య అలిగి వచ్చె యార్లగడ్డ
పూట గడుపుడంత వంటి రెక్కల పంట
గొప్ప చెప్పుకొనుట ఒప్పు గాదు. 

❷ చిన్న పల్లె గలదు చింత్కర్రపాలెము
నెల్లి కోట రెడ్ల చెల్లి అమ్మ
పలుకు నింటి పేరు “పల్లాల”వారని
రీతియైన కొండరెడ్డి బిడ్డ. 

❸ యార్లగడ్డ నాకు అడ్రస్సు నిచ్చింది
పాడి పంటలు గల పల్లె మాది
కదిలి మెదిలి నాను కడబాల వారింట
వాసికలిగి నట్టి వంశ మందు

❹ అక్షరాలు రాని ఆదిదంపతులకు
కాయకష్టము పడు కార్మికులకు
కలిగితినిగదయ్య కడసారి బిడ్డగా
విశ్వనాథ చలువ వీక్షణముల. 

❺ చదువు రాని నాన్న కొదువలేదు ప్రేమ
చదువు కొరకు నన్ను వదిలినారు
తప్పటడుగులేస్తు తాటాకు బళ్ళోకి
పలకబలపములతొ పయనమైతి. 

❻ గుడిసెఅబ్రహాము గురువర్యుల చలువ
పట్టి నేర్చు కొంటి పద్య కవిత
తప్పు లెంచకుండ దయ చూపుడోయంత
నిండు దీవెనలను మెండు గిచ్చి

❼ ఊహ లేని నాడు ఊయల పాటలు
     నేర్పిన తొలి గురువు నేస్తమమ్మ
     అమ్మ కన్న కలల అర్థమిపుడు తీరె
      పూర్వజన్మ లోని పుణ్య ఫలము. 

❽ పద్యములను పడితి బద్నాలుగవ యేట
     విస్మరించి నాను వింతగాను
     బాల్యమున కలిగెను “బాలకవి”బిరుదు
      ఒజ్జలంత నన్ను ఉద్దరించ. 

❾ స్ఫూర్తి నిచ్చె నాకు కార్తికేయశ్శర్మ
     అల్లు శతక మొకటి అందముగను
     గురువు గారి వాక్కు గుర్తుగా వ్రాస్తున్న
     మన్నె బిడ్డ మాట మంచి బాట

❿ గుండెజబ్బు వాన్ని గుర్తున్నదా మీకు
      కోసి అతికి నారు కొత్త నరము
      దరికి చేర్చు కోండి దయతోడనను మీరు
      ఆదరించి నన్ను ఆదుకొనుడు

⑪ బతుకు బండి మోయు బడి పంతులయ్యను
    ముద్దు బిడ్డ లేమొ ముగ్గురయ్య
    భార్య బిడ్డ కొరకు బండి లాగుడు నాది
     తప్ప దెవరికైన తిప్పలన్ని. 

⑫ సుఖదుఃఖములు నాకు చూపె మహత్తులు
      నుదిటి రాత మార్చ నెవరి తరము
      దుక్క వంటి నేను నక్కనైతిని నేడు
      తనువు చాలు వరకు తప్ప దింక . 

⑬ చక్కనైన వనిత సహథర్మఛారిణీ
మంచి మనసు కలది మైత్రి కలది
పేరు పిలువ గాను బేబీ మహాలక్ష్మి ! 
ఒద్ది కయిన మహిళ బుద్ది కలది. 

⑭ ప్రథమ పుత్రుడేమొ “పైడి”సమానుడు
“శివ కుమారు”పేరు సిరుల మూట
ఇలన వేల్పు “శివుని” ఋణము తీరు దిశన
పేరు పెట్టి నారు పెద్ద లంత. 

⑮ ఇంజనీరు విద్య నెంచు కున్నాడులే
ఓర్పు నేర్పు తోడ ఉత్తముడుగ
మనసు పెట్టి చదివె మైనింగు విద్యను
విధుల జేరి నాడు విత్తు కొరకు

⑯ వైద్యవిద్య చదువు వాణి దివ్యారాణి
ఒకతె ఆడ బిడ్డ ఓర్పు కలది
చదువు పిచ్చి తనకు సఖ్యతనేకోరు
మనసు వెన్న తీరు మాట పొదుపు. 

⑰ చివర పుట్టినతడు “శివసాయి”తనపేరు
కష్ట పెట్ట డెపుడు కార్యశీలి
నాన్న అడుగు జాడ, నాణ్యతమరువడు
తల్లి మనసు నెరిగి తరయువాడు! 

⑱ పట్టు పురుగు పెంచు పట్టు సాధించాను
అధిక దిగుబడిచ్చు ఆకు పెంచి
పంట సాగు జేయు పద్ధతి నేర్చాను
నారు మడులు కట్టి నాట్లు వేసి

⑲ తాతతండ్రులంత వెతలబతుకులాయె
పెట్టి నాను గోడ మట్టి పిసికి
బాల్యమందు కొన్ని బాధలే పడ్డాను
అయ్య చచ్చి పోయె అమ్మ మిగిలె

⑳ దిక్కు లేని బతుకు దీనాతి దీనము
అయిన వారు లేరు ఆశ లేదు
చెడ్డ చెలిమి పట్టి చెడి పోవు సమయాన
అమ్మ నన్ను జేర్చె ఆశ్రమమున

21) తల్లి వాణి చలువ దక్కించు కున్నాను
మెట్టు మెట్టు ఎక్కి మెరుగు పొంది
నేను తప్ప పల్లె నొవరు చదివిలేరు
మాయ కాదు రన్న మహిమ లేదు

22) చదువు వారి కంత శతకోటి దండాలు
సౌఖ్యమీయ వయ్య చదువు వార్కి
విధిగ నన్ను గాయు విశ్వనాథప్రభో
దండమోయి నీకు దండమొపుడు ! 

      

కడబాల గారి "గిరిజన శతకము"

                        కడబాల నాగేశ్వర్ రావు

కడబాల "గిరిజన శతకము"

1.విఘ్ననాథ! కరుణ వీక్షణాలందించు
  అక్షరాల కూర్పు అమరునట్లు
  సహకరించగవలె శతకమొకటి వ్రాయ
  మన్నె బిడ్డ మాట మంచి బాట.

2.ఆదివందనంబు అడవి తల్లికి జేసి
  సిరుల నిచ్చునట్టి గిరుల కొలచి
  వ్రాయుచుంటినయ్య రమణీయ శతకంబు
  మన్నె బిడ్డ మాట మంచి బాట.

3.రంపచోడవరము, రాజవొమ్మంగియు
  అడ్డతీగలయను దొడ్డపురము
  గంగవరము, యార్లగడ్డ రామవరము
  మన్నె బిడ్డ మాట మంచి బాట.

4.మన్యమకుటమైన మారేడుమిల్లియు
  పసిడి నేల దేవి పట్టణంబు
  మండలములు యేడు మాత్రమే గలవింక
  మన్నె బిడ్డ మాట మంచి బాట.

5.అందమైన కోటనందూరు, తుని, శంఖ
  వరము, ప్రక్కనున్న ప్రత్తిపాడు
  మండలములలో మరికొన్ని ఊళ్ళుండె
  మన్నె బిడ్డ మాట మంచి మాట.

6.ఎంపికయ్యె తూర్పు ఏజెన్సిప్రాంతంబు
  గిరిబనాభివృద్థి జరుపు సంస్థ
  ఐ. టి. డి. య్యె వెలసె అలచోడవరములో
  మన్నె బిడ్డ మాట మంచి బాట

7.పదిలపరచబడెను పథకాలు ఎన్నెన్నొ
గిరిజనుల వెతలను తరిమివేయ
కనుక ఐ. టి. డి. య్యె కల్పవృక్షము గదా!
మన్నె బిడ్డ మాట మంచి బాట.

8.సంతసమున నీకు సహకారమందించ
ఆనుపానులన్ని అందు గలవు
బడుగు గిరిజనులకు బ్రతుకు మార్గాలుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట.

9.ఐ. టి. డి. య్యె యనెడుఅభివృద్ధి సంస్థను
ప్రగతి మార్గమందు వేగనడుప
పథక నిర్వహణకు ప్రాజెక్టు అధికారి
మన్నె బిడ్డ మాట మంచి బాట.

10.ఇండ్లు, బండ్లు, ధనము ఇతర సౌకర్యాలు
విద్య, మరియు ఉచిత వైద్య సేవ
చేయుచుండిరయ్య చేరదీసి జనుల
మన్నె బిడ్డ మాట మంచి బాట.

11ప్రభువు మనకు గలడు పథకాలు నడిపించ
కార్యవిధుల జూచు కార్యశీలి
కొలుచు వారి కెల్ల కొంగు బంగారము
మన్నె బిడ్డ మాట మంచి బాట

12అరయ నడవి తల్లి అనురాగవల్లిరా!
అంది పుచ్చుకొనుము అఖిల సుఖము
అడవి వృద్ధి చెంద అవని వర్ధిల్లురా!
మన్నె బిడ్డ మాట మంచి బాట

13. కోయదొరలు మరియు కొండ్రెడ్డి, వాల్లీకి
వన్నె లొలుకు దొరలు, మన్నె దొరలు
కలవు కొండకాపు, కమ్మర కులములు
మన్నె బిడ్డ మాట మంచి బాట

14 మాలొ లేనె లేరు మంగళ్ళు మరిజూడ
సిగల కొరకు జుట్టు సిరులు పెంచు
ఆది నుండి మాకు అంటదు క్షురకర్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట

15 అన్నదమ్ములవలె నన్నింట నుందుము
అడవి తల్లి మెడకు హార మల్లె
ఆది గురువు మాకు అడవి తల్లేనురా !
మన్నె బిడ్డ మాట మంచి. బాట

16 అడవి తల్లి బిడ్డలందరమ్మొక్కటే
లేదు భేష జమ్ము లేదు మాకు
చేయి చేయి కలిపి చేస్తాము పనులన్ని
మన్నె బిడ్డ మాట మంచి బాట

17 కాయకసరు లేరి కలిసి భుజించేము
వావి వరస తెలిసి పలుకుతాము
ఆదిజాతి మాది అన్నిజాతులలోన
మన్నె బిడ్డ మాట మంచి బాట

18 మతము కన్న మాకు మానత్వము మిన్న
పెద్దవారి మాట చద్దిమూట
కూలదోయమెపుడు కుల పెద్దమాటలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

19. మల్లె, సన్నజాజి, మందార, సంపెంగ
విరుల వంటి మనసు వెలుగు మాది
తేనెలొలుకు తేట తెలుగు భాషయెమాది
మన్నె బిడ్డ మాట మంచి బాట

20. అడవి తల్లి ఒడిన అల్లారు ముద్దుగా
ఆడిపాడినాము ఆదమరచి
అరమరికలు లేవుఅభ్యాసమున మాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట

21. కొండ కోన మనకు అండగానుండగా
ఎండమావి కాదు కొండ బతుకు
గుండె నిబ్బరమును నిండుగా పెంచుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట

22. చదువు సంధ్యలన్ని చక్కగా నేర్చుకో
భయములేదు నీకు భావియందు
దేశ సేవ చేయ ధీరుడా లేలెమ్ము !
మన్నె బిడ్డ మాట మంచి బాట

23. మనిషి పుట్టి పెరిగి మట్టిలో కలియును
పుడమి తల్లి రుణము విడువ వద్దు
మనిషి జన్మ మనకు మరల కలదోలేదొ
మన్నె బిడ్డ మాట మంచి బాట

24.అలుపెరుగని పనులు సలుపుమాఎవ్వేళ
అమ్మనాన్నలందు ఆదరమును
మరువ వలదు ఎపుడు మనసు నందుంచుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట


25.పీకలోతు తాగి పీనుగుగామారి
భవిత వదిలి నీవు భంగపడకు
పచ్చనయిన బాట వెచ్చగా సాగిపో!
మన్నె బిడ్డ మాట మంచి బాట

26.ఉన్నదాన్ని బట్టి ఒడుపుగా మసలుకో
కోరరాని ఫలము కొంపముంచు
మర్మమెరిగి బ్రతుకు మలచుకో సాగిపో!
మన్నె బిడ్డ మాట మంచి బాట

27.చదువు లేనివాడు అదుపు తప్పునెపుడు
చదువ బడులు కలవు చక్కగాను
విద్యనేర్చినపుడె విజ్ఞానమబ్బురా!
మన్నె బిడ్డ మాట మంచి బాట

28. అడ్డు లేదు నీకు అవని యందెక్కడ
అలుగు వోలెపొమ్ము కలుగు జయము
భావి జీవనంబు బాగుగా వెలుగొందు
మన్నె బిడ్డ మాట మంచి బాట

29. చెట్లు చేమలందు చెలిమిని ఆశించు
కల్మషమ్ము లేని కార్మికులము
కాయకష్టమందు కలుగును ఫలితంబు
మన్నె బిడ్డ మాట మంచి బాట

30. గౌరవించుమయ్య ఘనముగ పెద్దలన్
తల్లిదండ్రి మాట తప్పవద్దు
గురువు గారి మాట సిరుల మూటే కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట.

31. అక్షరాలు రాని అన్యులందరికినీ
విద్య నేర్పవయ్య విధిగ నీవు
విద్య దారి చూపు విశ్వమందు నెపుడు
మన్నె బిడ్డ మాట మంచి బాట

32. ఆత్మసాక్షి నెరిగి అన్నింట మసలుకో
కీడు చేయబోకు కీర్తి కొరకు
నీతి లేని వాడు కోతి కంటెను పాడు
మన్నె బిడ్డ మాట మంచి బాట

33. చట్ట సభల యందు చక్కగా రాణించి
వెలుగు పంచవయ్య విశ్వమునకు
స్ఫూర్పి పొంది నీవు కీర్తి సంపాదించు
మన్నె బిడ్డ మాట మంచి బాట

34. నాయకత్వ లక్షణాలను నేర్చుకో
ప్రగతి వైపు వెళ్ళు పట్టు పెంచి
దూరమేమి కాదు చేరగా విజయమ్ము
మన్నె బిడ్డ మాట మంచి బాట

35. అడవి బుట్టినాము నరయనదృష్టాన
సారిరారు మనకు జగతి నెవరు
గొప్ప చరిత గలదు చెప్పు కొనగ మనకు
మన్నె బిడ్డ మాట మంచి బాట

36. కొండవాడిననుచు కుంగిపోకెన్నడు
దుష్ట బుద్ది వాని దూషణలకు
కళ్ళు తెరచి నీవు కదము తొక్కవలెరా !
మన్నె బిడ్డ మాట మంచి బాట.

37. అడవి లోనె పుట్టె ఆదిమానవజాతి
గిరులలోనె పుట్టె “గిరిజ మాత”
అడవి తల్లి అండఅన్నిటా నీకుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట.

38. సురల నిలయమంత గిరుల పైనేకదా !
వెరువకయ్య నీవు గిరుల నుండ
గిరులె మనకు నిచ్చు సిరులు వేలకు వేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

39. మొరుగు శునక మెపుడు కరుచుననుట కల్ల
వదరు బోతువలెను వాగ వద్దు
మేలు జేసి చూపు మేటివై జనులకు
మన్నె బిడ్డ మాట మంచి బాట

40. వటము చూడ భువిన పటువైనదైనను
గాలి వాన రాగ కూలి పోవు
ఎవరి తనువు చూడ ఎంత కాలము మన్ను
మన్నె బిడ్డ మాట మంచి బాట

41. సాంప్రదాయములను చక్కగా కాపాడు
వెర్రి మొర్రి కుర్ర వేష మేల ?
పదిల పరచుమయ్య ప్రాచీన సంస్కృతి
మన్నె బిడ్డ మాట మంచి బాట

42. కుల, మతాల గొడవ కూర్మిని తెగతెంచు
కులము కుళ్ళు కంపు కుదరదయ్య
మతము మత్తు మందు మర్చిపో మహిలోన
మన్నె బిడ్డ మాట మంచి బాట.
🙏    ప్రాచీన వర్ణన      🙏

43. దబ్బగడ్డి కప్పు దలుసు మట్టితొ గోడ
అరుగు నల్ల మన్ను అటకపైన
పర్ణశాల వంటి పదిలమైనవి ఇళ్ళు
మన్నె బిడ్డ మాట మంచి బాట

44. గొప్ప అందమైన గోడ చిత్తర్లతో
సుద్ద, పసుపు, నలుపు సుడుల ముగ్గు
“గిరిజ”పనితనములు గీటు రాయిగ నిల్చు
మన్నె బిడ్డ మాట మంచి బాట

45. వంట ఇంట పొయ్యి, వెటసోక “జోలరి”
మట్టి కుండలోని మంచి నీళ్ళు
ఉట్టి మీద చట్టి, చట్టిలో అంబలి
మన్నె బిడ్డ మాట మంచి బాట

46. వెదురు తవ్వ, తట్ట, అదురు టొంపం, మీట
పొడుగు కాడ దోకి, పొట్టి గిద్ద
సొల్ప, దొప్ప, రేక, సొరకాయ దిప్పలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

47. చామ, కొర్ర, గంటె, ఆముదం, ఉలవలు
చోడి, కంది, పెసర,, జొన్న, నువ్వు
చిత్రమైన మన్య చిరుధాన్య సొగసులు
మన్నె బిడ్డ మాట మంచి బాట

48. గుమ్మడాకు కూర, గోమతంటే మాకు
చేమఆకు కూర, చిలక కూర
కాయగూర పువ్వు కంది గుగ్గిళ్ళును
మన్నె బిడ్డ మాట మంచి బాట

49. పనసతొనల కూర, మినపప్పు పులుసు
పుట్ట కొక్కు కూర, మొట్టలిగురు
మాడిటెంక చారు మన్య జనుల విందు
మన్నె బిడ్డ మాట మంచి బాట

50. ఈత పురుగు వంట, పాత బియ్యపు కూడు
కొండ గొర్రె వెంటి, కోడి కూర
వేట సాగినపుడు విందుగాదేమాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట

51. వెదురు కొమ్ము కూర, అదిరిపోవు రుచులు
ఉలవ పప్పు చారు విలువ కలది
గొడ్డు గూర ఆకు వండగా వదలరు
మన్నె బిడ్డ మాట మంచి బాట

52. వైము, నార, తేగ, మాటుము దుంప
తింటె హాయి కలిగి తృప్తి కలుగు
అడవి దొరుకు దుంపలాహారమే మాకు
మన్నె బిడ్డ మాట మంచి బాట

53. మాడి టెంక లబ్బి మెత్తగా కరిగించి
అడ్డ ఆకు మీద నద్ది కాల్చ
అదిరిపోవు రుచితొ అట్టు చేకూరును
మన్నె బిడ్డ మాట మంచి బాట

54. పనస పళ్ళ పారు పడిపోవు పిక్కలు
ఏరి తెచ్చి వార్చి ఎండబెట్టి
వానకాలమందు వండి తినుట హాయి
మన్నె బిడ్డ మాట మంచి బాట

55. ఉసిరి, ముషిణి, వేము, ఓషథి మూలికల్
పనస, నిమ్మ, కమల పండ్లు దొరుకు
వాటి నేరి తెచ్చి వర్తకునకు నమ్ము
మన్నె బిడ్డ మాట మంచి బాట

56. వేట లాడనాన్న వెంట అడవికెళ్ళి
అమ్మ కథల పాత్ర లందు జూస్తి
జంతు తతిని కాంచి సంతోషమొందితి
మన్నె బిడ్డ మాట మంచి బాట

57. ముక్కు కడ్డు బాస,  ముంజేత మురుగులు
కాళ్ళకు కడియాలు, వేళ్ళ బటువు
మెడన పూసగొలుసు నడయాడు నందాలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

58. నగలు మేను దాల్చి నవ్వులు రువ్వుచు
కురుల విరులు దాల్చి కులుకు లొలుకు
మగువ సొగసు జూడ మరులు పుట్టు మదిన
మన్నె బిడ్డ మాట మంచి బాట

59. చెట్టు, రాయి, రప్ప, పుట్టలోని పురుగు
నీరు, నిప్పు, గాలి, నింగి, ధరణి
సూర్యచంద్రులుయును సురలుగా పూజించు
మన్నె బిడ్డ మాట మంచి బాట

60. అడవి సంపదంత ఆదాయమే నీకు
పనస పండ్లు, తేనె, పచ్చిపసుపు
కొన్ని వెతలు దీరు కొండచీపుర్లమ్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట

61. చింతపండు, పసుపు, శీకాయ దినుసులు
సంచులందు పేర్చి సంతజేర్చు
గోనెబరువు మోయి గోంటెడ్ల చిత్రాలు
మన్నె బిడ్డ మాట మంచి బాట.

🙏గంగాలమ్మ పండుగ వేడుక🙏

62. ఆముదాలు తెచ్చి ఆదివారము నాడు
వండి నూనె తీయు వందనముగ
క్రొత్త దుత్త తెచ్చి వత్తిని వెలిగింత్రు
మన్నె బిడ్డ మాట మంచి బాట

63. వెల్లకుండ కేసి రెల్ల పూవులు కట్టి
పసుపు కుంకుమెట్టి పళ్ళనిత్రు
“మల్లొ మల్లొ”అనుచు మలిగంగిపాటతో
మన్నె బిడ్డ మాట మంచి బాట

64. దుత్త నెత్తి నుంచి కొత్త బట్టలు కట్టి
కన్నె పిల్లలంత కదులు తారు
ఇల్లు ఇల్లు దిరిగె ఇలవేల్పు గంగమ్మ
మన్నె బిడ్డ మాట మంచి బాట

65. జంబటూయలందు అంబను ముందూపి
బూతు పాట పాడి పూజ జేత్రు
గౌరవింతురంత “గొరవ”పూజారిని
మన్నె బిడ్డ మాట మంచి బాట

66. గంగతల్లి కొరకు గంగమ్మ పండుగ
కోలటాట బసలొ కొంటె పాట
భూమితల్లి కొరకు భూదేవి పండుగ
మన్నె బిడ్డ మాట మంచి బాట


67. ఆకు కొమ్మ తెచ్చి అంగటలికి పెట్టి
నిండు కుండలోని నీళ్ళు దెచ్చి
కోడిపుంజుబట్టి కోసి బొట్టును పెట్టు
మన్నె బిడ్డ మాట మంచి బాట

68. మత్తు మాంస ములను చిత్తుగా భుజియించి
ఓయి పాట పాడు హాయి గాను
గంగదేవి కొరకు గంతులే వేసేను
మన్నె బిడ్డ మాట మంచి బాట

🙏 సంకురాతిరి పండుగ 🙏


69. సంకురాత్రి నాటి సందడే సందడి
భోగి తాన మాడి కాగి అగ్గి
పిలిచి దేవతలకు పెట్టు నైవేద్యము
మన్నె బిడ్డ మాట మంచి బాట

70. పశువు కొట్ట మంత పరిశుభ్రముగజేసి
పసుపు కుంకుమలతొ పాడి కొరకు
పూజ జేతురయ్య ముదముతో పల్లెలన్
మన్నె బిడ్డ మాట మంచి బాట

🙏🙏   ఆటలు   🙏🙏

71. పండు వెన్నెలందు పడుచులంతా జేరి
గొంతెనమ్ము లాడు గోలజేస్తు
ముక్కు గిల్లుడాట మక్కువైనది కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట

72. కుయ్యి కుయ్యి కోడి కూత కుయ్యాలంటు
కూతలాట లాడు కొంటె గాళ్ళు
ఆట లాడ కుంటె ఆనందమే ముంది !
మన్నె బిడ్డ మాట మంచి బాట

🙏 వివాహ పద్ధతులు 🙏


73. కోలటాట బసలొ కొంటె పాటలు పాడి
యువత జతలు కట్టి ఉరుకు తారు
రాక్షసుల వివాహ రకమంటె ఇదియేను
మన్నె బిడ్డ మాట మంచి బాట

74. అమ్మ జాతరంటు అర్థరాత్రుల నందు
వధువు వరుస తెలిసి అదును చూసి
లాగి చేయి పట్ట లాగు లాటల పెళ్ళి
మన్నె బిడ్డ మాట మంచి బాట

75. నచ్చిన వరునెంచి నలుగురితో కల్సి
ఒట్టు పెట్టి కన్య “కోలి”నిచ్చి
సాంప్రదాయమైన చక్కనైనది పెళ్ళి
మన్నె బిడ్డ మాట మంచి బాట

76. “ఓలి”నిచ్చి చేయు ఒద్దికయిన పెళ్ళి
వెళ్ళ వద్దు వెర్రి వేలమునకు
కట్నకానుకెపుడు కాదు శాశ్వతములు
మన్నె బిడ్డ మాట మంచి బాట

77. వెరువ కయ్య నీవు వెనుకబడ్డావని
పట్టుదలను పెంచు ప్రగతి కలుగు
గొట్టి సభల యందు గొంతెత్తి మాట్లాడు
మన్నె బిడ్డ మాట మంచి బాట

78. ఆశ్రమాన విద్య ఆరోగ్యమందించు
వసతులన్ని కలవు మసలు కొనగ
గిరిజనులను మేటి పురజనులను జేయ
మన్నె బిడ్డ మాట మంచి బాట

79. నాటి గురువు లంత ధీటైన గురువులు
లోటు లేని దమ్మ నాటి విద్య
కష్టపడితి నాడు కలిగె నేడు సుఖము
మన్నె బిడ్డ మాట మంచి బాట

80. పలక పట్టి మేము పాఠశాలకు వెళ్ళి
పంతులయ్య చెప్పు పాఠమంత
ఆలకింపులాయె ఆనాడు మాకెంతొ
మన్నె బిడ్డ మాట. మంచి బాట

81. ఆశ్రమాన మాకు అన్ని వసతులుండె
బట్టలిచ్చు, రేకు పెట్టె లిచ్చు
తలకు నూనె, సబ్బు తానమాడగ నిచ్చు
మన్నె బిడ్డ మాట. మంచి బాట

82. చాప, దుప్పటిచ్చి చక్కగా చూతురు
పుష్కలముగ నిత్రు పుస్తకాలు
విద్యతోడనెన్నొ విషయాలు బోధింత్రు
మన్నె బిడ్డ మాట మంచి బాట

83. మూడుపూట్ల తిండి ముచ్చటగా బెట్టి
బలము మందులిచ్చి బలిమి పెంచి
స్వీటు, పళ్ళు నిత్రు లోటు లేకుండగా
మన్నె బిడ్డ మాట మంచి బాట

84. పాఠశాల యందు పనిచేయ నుద్యోగ
బాధ్యతల విధులను పంచి ఇచ్చు
సక్రమముగ నీవు చరితార్ధుడవు కమ్ము
మన్నె బిడ్డ మాట. మంచి బాట

85. సమసమాజ రూపు సత్వరమే కల్గు
పల్లకుండ వద్దు పాడి గాదు
నీవు చేయు పనులు నిష్ఠగా చేయుము
మన్నె బిడ్డ మాట మంచి బాట

86. అతిపవిత్రముగద అధ్యాపకుని వృత్తి
అంకితమ్ము కమ్ము ఆత్మ సాక్షి
అన్ని వృత్తులకును ఆదర్శమది కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట

87.అర్హతకలవారు అంశాలు బోధించ
వృద్ధి చెందగలదు విద్య విలువ
శిక్షణ కరువైన శిధిల మౌనుర విద్య
మన్నె బిడ్డ మాట మంచి బాట

88. ప్రజలు కొంత మంది పనులేమి దొరకక
విద్యబోధ చేయు విధుల జేరి
తప్పిదాలు చేసి తలవంపులగుచుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట

89. పాఠశాల విలువ పదిల పరచువారు
గురువులైన విద్య పరువు నిలుచు
గురువు లేని విద్య గుడ్డి విద్యరజూడ
మన్నె బిడ్డ మాట మంచి బాట

90. కొత్త విషయములను కోర్కెతో నేర్చుకో
మెదడు పదును చెందు మేటి గాను
విద్య లేని నాడు విలువేమి పెరుగురా !
మన్నె బిడ్డ మాట మంచి బాట

91. తాగవద్దు పొగను, తల నున్నగా దువ్వు
బట్ట శుభ్రముంచి బడికి వెళ్ళు
పాదరక్ష వేసి ప్రగతి రక్షింపుమా! మన్నె బిడ్డ మాట మంచి బాట

92. సిగరు, జర్ధ, బీడి చెరచురా నీమేను
విడిచి పెట్టగవలె విధిగ నీవు
చెడ్డగుణము చూసి చెడిపోవు పిల్లలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

93. శాస్త్ర విషయమెల్ల చక్కగా తెలుసుకో
ఇంటిలోకి వచ్చు ఇంట్రనెట్టు
పల్లె పట్నమంత పాకింది ఈనెట్టు
మన్నె బిడ్డ మాట మంచి బాట

94. వార్తలెల్ల చదివి వర్ణంచి చెప్పాలి
విషయమంత తెలియు వివిధ గతుల
వార్తవలన జగతి వర్ధిల్లుచున్నది
మన్నె బిడ్డ మాట మంచి బాట

95. అర్ధగంట సేపు అభ్యాసమొనరించి
పావుగంటలోన ప్రశ్న నేర్పు
పిరికి తనము పోవు పిల్లలందరికిని
మన్నె బిడ్డ మాట మంచి బాట

96. సులువు తెలుసుకుంటె కొలువు పొందగవచ్చు
కొలువు పొందినపుడె కోర్కె తీరు
కోర్కె తీరినపుడె కొరత తీరును కదా !
మన్నె బిడ్డ మాట మంచి బాట

97. వెర్రి జతలు బట్టి వెలగాక తిరిగిన
బ్రతుకు కష్టమగును వెతలు కలుగు
మంచి దారి బట్టి మసలుకొనుట మేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

98. ఏడ్సు భూతమొచ్చి ఎందరినో జంపె
యుక్తి తెలుసుకోండి యువకులంత
జబ్బు వస్తె మందు జగతిలో లేదయ్య
మన్నె బిడ్డ మాట మంచి బాట

99. తిరుగు బోతువారి తీట తీర్చగవచ్చె
ఏడ్సు రోగమనెడు ఎండు తెగులు
మరిచిపోక మంచి మార్గమెంచుకొనుడు
మన్నె బిడ్డ మాట మంచి బాట

100.ఏకలవ్య ధీక్ష నెన్నుకొనుము నీవు
బీదవాడి ననుచు బిడియపడకు
కాంచి నేర్చుకొనుము కన్నప్ప పట్టును
మన్నె బిడ్డ మాట మంచి బాట

101.ఐ. టి. రంగమందు ఆదరణ కలదు
శాస్త్ర విద్య నేర్వ సౌఖ్యమయ్య
ఇంజనీరు విద్య నెంచకొనుట మేలు
మన్నె బిడ్డ మాట మంచి బాట

102.గాలి వేగమైన కమ్యూనికేషన్లు
శీఘ్రగతిన జేరు చిట్టి కబురు
తంతిలేని ఫోన్ల వింతలను తెలుసుకో
మన్నె బిడ్డ మాట మంచి బాట

103.సులభ మార్గమైన సుఖములున్నవినేడు
మేను అలవనట్టి,  మేటి హాయి
శాస్త్ర విద్య యొక్క సౌఖ్యమే కద ఇదీ !
మన్నె బిడ్డ మాట మంచి బాట

104.కంప్యుటర్ల మహిమ కడురమ్యమైనది
కొద్దిలోనె తొలగు పెద్ద చిక్కు
సెకనులోనె పనులు చేసి చూపగ వచ్చు
మన్నె బిడ్డ మాట మంచి బాట

105.కల్లు చెట్ల చుట్టు కలిసి తిరుగుతారు
చుట్ట లడ్డ పొగను జుర్రుతారు
కాదు కూడదంటె కసురు కుంటారయ్య
మన్నె బిడ్డ మాట మంచి బాట

106.నమ్మి నారు అంటె నాన బోసేస్తారు
కసురు కుంటె మరల కానరారు
అడవి బిడ్డ మనసు ఆదర్శప్రాయము
మన్నె బిడ్డ మాట మంచి బాట

107.దిక్కుమొక్కు లేని దీనబాలురకైన
తిండి వసతి, బట్ట తృప్తిగాను
ఉచిత విద్య నేర్ప ఊరూర బడులుండె
మన్నె బిడ్డ మాట మంచి బాట

108.జనులు అధికమైన పనులెట్లు దొరుకును
సంతు ఎక్కువైన వింత బాధ
ఒక్క బిడ్డ చాలు చక్కగా పెంచంగ
మన్నె బిడ్డ మాట మంచి బాట.

🙏         సమాప్తం        🙏